ఈ ఏడాది మార్చి నెలలో రిలీజ్ కానున్న సినిమాలలో రాబిన్ హుడ్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా అదే సమయంలో మ్యాడ్ స్క్వేర్ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. రాబిన్ హుడ్ సినిమా ఈ నెల 28వ తేదీన రిలీజ్ కానుంది. మ్యాడ్ స్క్వేర్ సినిమా ఈ నెల 29వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా మ్యాడ్ స్క్వేర్ మూవీ ప్రీ పోన్ కావడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
 
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ మేమెంతో నమ్మిన డిస్ట్రిబ్యూటర్ల కోరక ప్రకారం మ్యాడ్ స్క్వేర్ సినిమాను ఒకరోజు ముందు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని తెలిపారు. మార్చి నెల 29వ తేదీన అమవాస్య అని దీంతో ఒకరోజు ముందుగానే రిలీజ్ చేయడం ఉత్తమమని వారు భావించారని నాగవంశీ వెల్లడించారు. డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయాన్ని మేము సంతోషంగా స్వాగతించామని నాగవంశీ పేర్కొన్నారు.
 
ఈ మేరకు మా సినిమాను మార్చి నెల 28వ తేదీన రిలీజ్ చేస్తున్నామని నాగవంశీ వెల్లడించారు. చివరి నిమిషంలో కావాలని సినిమాను రీషెడ్యూల్ చేసే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదని నాగవంశీ పేర్కొన్నారు. మార్చి 28వ తేదీ ప్రేక్షకులకు ఎంతగానో గుర్తుండిపోవాలని కోరుకుంటున్నానని నాగవంశీ చెప్పుకొచ్చారు. రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు మంచి సక్సెస్ సాధించాలని ఆయన తెలిపారు.
 
ఈ సమ్మర్ కు ప్రేక్షకులకు నవ్వుల పండగే అని నాగవంశీ చెప్పుకొచ్చారు. నాగవంశీ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మ్యాడ్ స్క్వేర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడం పక్కా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మ్యాడ్ స్క్వేర్ మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కిందని సమచారం అందుతోంది. ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మ్యాడ్ స్క్వేర్ సినిమాలో కథ ఉండదని మేకర్స్ పబ్లిక్ గానే స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: