
హిట్ ఫ్రాంచేజీలో ఇది మూడో భాగం కావడం తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి .. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించడున్నాడు .. అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్‌కు కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది .. ఇక ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది . అయితే ఇదే రోజు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన రిట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెర్కక్కుతున్న ఈ చిత్రం వింటేజ్ యాక్షన్ నేపథ్యంలో రానుంది . ఇటీవల సూర్య కంగువా సినిమాతో భారీగా నిరాశ పరిచయ నేపథ్యంలో ఈ సినిమాతో మరోసారిహిట్ అందిస్తుందనే గట్టి ఆశలు పెట్టుకున్నాడు ..
మేకర్స్ కూడా ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నారు . అలాగే మే నెల చివర్లో విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీతో థియేటర్లోకి రానున్నారు .. మే 30న గ్రాండ్గా ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. . విజయ్ సరికొత్త లుక్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇక టీజర్‌లో పోలీస్ గెటప్ లో విజయ్ స్టైలిష్ నటన సినిమాపై ఆసక్తిని పెంచేసింది .. కొత్త కథా అంశంతో సినిమా తెరకెక్కడంతో విజయ్ ఫ్యాన్స్ ఈసారి కచ్చితంగా హిట్ కొడతామని నమ్మకంగా ఉన్నారు .. ఈ మూడు సినిమాలు త్రిముక పోటీకి రెడీ కావడంతో మే నెల టాలీవుడ్ థియేటర్లకు అసలైన పండుగ రానుంది . హిట్ 3, రిట్రో, కింగ్డమ్ .. వీటిలో ఏది బాక్సాఫీసును షేక్ చేస్తుందో చూడాలి.