
అందుకే మ్యాడ్ స్క్వేర్ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది హైప్ పెంచుతూ ఉన్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ తో ఆడియన్స్ ని కడుపుబ్బ నవ్వించారు. ఈ చిత్రంలో ఇంతకంటే ఎక్కువగా కామెడీ ఉంటుందని చిత్ర బృందం ఇటీవలే హైదరాబాద్లో జరిగిన ఒక ఈవెంట్లో మాట్లాడడం జరిగింది. ఈనెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఇలాంటి సమయంలోనే తాజాగా ఒక న్యూస్ వైరల్ గా మారుతుంది. అదేమిటంటే ఈ సినిమా ఫ్రీ ఫోన్ అయినట్లుగా నిర్మాత నాగ వంశీ తన ట్విట్టర్ నుంచి వెల్లడించారు.
తన ట్విట్టర్లో మా డిస్ట్రిబ్యూటర్ సపోర్టుతో రిక్వెస్ట్ తో మ్యాడ్ స్క్వేర్ సినిమా ఒక్కరోజు ముందు అంటే మార్చి 28న విడుదల చేయబోతున్నామంటూ తెలియజేశారు. ఇది డిస్ట్రిబ్యూటర్లు అడగడంతో మేము హ్యాపీగా ఉన్నామని తెలిపారు నాగ వంశీ. అలాగే మార్చి 28న తమ సినిమాతో పాటు నితిన్ నటిస్తున్న రాబిన్ ఫుడ్ సినిమాలు కూడా విడుదల అయ్యి మంచి విజయాలని అందుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఇక నితిన్ సినిమాని డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కిస్తూ ఉండడంతో ఆయనకు కూడా విష్ చేశారు నిర్మాత నాగ వంశీ. ప్రస్తుతం నాగ వంశీ చేసిన ట్వీట్ వైరల్ గా మారుతున్నది.