మొన్నటివరకు మన హీరోలు ఒక ఇండియానే మెయిన్ మార్కెట్ అయితే .. ఓవర్సీస్ వారికి బోనస్ కింద ఉండేది .. కానీ సీన్ అలా కాదు .. ఓవర్సీస్ కూడా సినిమాల ఫలితాన్ని డిసైడ్ చేస్తుంది .. మరి ముఖ్యంగా జపాన్ మనకు సెకండ్ ఆప్షన్ గా మారిపోయింది .. తాజాగా ఇప్పుడు దేవరతో జపాన్ జర్నీకి రెడీ అవుతున్నారు ఎన్టీఆర్ .. అయితే ఇక్కడ ఇండియాలో వచ్చిన రిజ‌ల్ట్ ఏ రిపీట్ అవుతుందా ? దేవరను జపనీస్ ఆదరిస్తారా ? జపాన్లో మెల్లమెల్లగా ఇండియన్ సినిమాలుకు మంచి మార్కెట్ పెరుగుతుంది ..  


ముఖ్యంగా తెలుగు హీరోలకి కూడా అక్కడ భారీ గుర్తింపు వస్తుంది .. ఇప్పటికే ప్రభాస్ జపనీస్ కు బాగా దగ్గరయ్యాడు .. బాహుబలి , సలార్ వంటి సినిమాలు అక్కడ మంచి కలెక్షన్ రాబట్టాయి .  కానీ కల్కి తో మాత్రం కొంత నిరాశపరిచాడు ఈ రెబల్ స్టార్. అయితే ప్రభాస్ మాత్రమే కాదు తెలుగులో రామ్ చరణ్ , ఎన్టీఆర్ సినిమాలు కూడా జపాన్లో మంచి మార్కెట్ ఉంది .. త్రిబుల్ ఆర్ తో జపాన్లో తిరుగులేని అభిమానులను క్రియేట్ చేసుకున్నారు ఈ ఇద్దరు హీరోలు. అక్కడ ఏకంగా సంవత్సరం పాటు ఆడింది త్రిబుల్ ఆర్ .. గత 30 సంవత్సరాలగా ముత్తూ పేరు మీదున్న రికార్డులు సైతం త్రిబుల్ ఆర్ బద్దలు కొట్టింది .. అది ఎన్టీఆర్ కు బాగా కలిసి వచ్చింది .  


త్రిబుల్ ఆర్ తో వచ్చిన క్రేజ్ వాడుకుంటూ దేవరన్ని కూడా జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇక మార్చ్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ జపాన్ వెళ్తున్నారు .. ఇప్పటికే అక్కడ మీడియాతో జూమ్లో మాట్లాడారు ఎన్టీఆర్ ఆ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2తో బిజీగా ఉన్నారు .. అలాగే ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు .. త్వరలోనే ఈ షూటింగ్లో ఎంట్రీ ఇస్తారు ఎన్టీఆర్ .. ఇక మార్చ్ 22న జపాన్ వెళ్తున్నారు ఎన్టీఆర్ ఈలోపు జూమ్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు . మరి మన దగ్గర అదరగొట్టిన దేవర జపాన్లను అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: