తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి  సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆ సినిమా తర్వాత ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతాలను సంపాదించుకున్నాడు.సినిమా తీసే విధానాన్ని మార్చేసిన ఈ దర్శకుడు అనిమల్  సినిమాతో ఒక బోల్డ్ కంటెంట్ తో కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించవచ్చు అని నిరూపించాడు. ఇక తన డైరెక్షన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రామ్ గోపాల్ వర్మ  తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీని మరొక కోణంలో చూపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగనే కావడం విశేషం ప్రస్తుతం ఆయన ప్రభాస్  తో స్పిరిట్  అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రభాస్ ని ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి రెండు వేల కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన అనుకుంటున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? తద్వారా ఈయనను స్టార్ డైరెక్టర్ గా మరోసారి ఎలివేట్ చేస్తుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.ఇదిలావుండగా అర్జున్ రెడ్డి'తోనే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 50 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. అటుపై అదే చిత్రాన్ని బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' గా రీమేక్ చేసి 300 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టాడు.

కబీర్ సింగ్' లాంగ్ రన్ లో 380 కోట్ల వసూళ్లను సాధించింది. అటుపై 'యానిమల్' తో ఏకంగా 900 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. 1000 కోట్లకు కేవలం 100 కోట్ల దూరంలోనే ఆగిపోయాడు. ఇలా మూడు సంచలన విజయాలు అందుకున్న సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ టార్గెట్ 2000 కోట్లు అయి ఉండొచ్చు? ఎందుకంటే తదుపరి చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో 'స్పిరిట్' చేస్తున్నాడు కాబట్టి ఈ రకమైన గెస్సింగ్స్ తెరపైకి రావడం సహజమే.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఉత్పన్నమైంది. 'స్పిరిట్' ద్వారా సందీప్ రెడ్డి వంగా రూ. 2000 కోట్ల చిత్రాన్ని అందిస్తారా? అని ఫిల్మ్ జర్నలిస్ట్ అడిగాడు. దానికి సందీప్ ఇలా బధులిచ్చాడు. 2000 కోట్లు అన్నది అతి పెద్ద సవాల్. చెప్పినంత ఈజీ కాదు.బాహుబలి 2 ఆ మార్క్ కి దగ్గరగా వెళ్లింది. అది ప్రేక్షకుల్ని ఎంతో గొప్పగా ఆకట్టుకున్నచిత్రం. ఎంతో ఆసక్తిని కలిగించే చిత్రమిది.మరి స్పిరిట్ తో అది సాధ్యమవుతుందా? లేదా? అన్నది చూడాలి.మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడానికి చాలావరకు కృషి చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అనే పోటీ జరుగుతుంది. అందులో సందీప్ రెడ్డి వంగా కూడా ఉండటం విశేషం…మరి తను ఈ సినిమాలతో భారీ విజయాలను అందుకొని నెంబర్ వన్ దర్శకుడిగా మారతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: