
లింగు స్వామి వారియర్, వెంకట్ ప్రభు కస్టడీ, శంకర్ గేమ్ చేంజర్ .. ఇలా కొన్నాళ్లుగా తెలుగులో అట్టర్ ప్లాప్లే ఇచ్చారు తమిళ దర్శకులు .. తమ బ్రాండ్ తో సంబంధం లేకుండా డిజాస్టర్లే అందుకున్నారు . తెలుగు హీరోలు , తమిళ దర్శకులు అంతగా కలిసి రాకపోయినా ఈ క్రేజీ కాంబినేషన్స్ మాత్రం సెట్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా టాలీవుడ్ టాప్ హీరోలంతా కోలీవుడ్ దర్శకులకు రెడ్ కార్పోరేట్ వేసి సినిమాలు కోసం ఓకే చెప్తున్నారు .. అయితే ఇప్పుడు ఈ క్రమంలోనే లోకేష్ కనకరాజ్ ఇప్పటికే ప్రభాస్ తో సినిమా ఉంటుందని ప్రకటించారు .. ప్రస్తుతం ఈయన రజనీకాంత్ కూలీతో బిజీగా ఉన్నారు. జైలర్ ఫ్రేమ్ నెల్సన్ కూడా టాలీవుడ్ పై గురి పెట్టారు ..
ఈయన కూడా రజనీకాంత్ హీరోగా జైలర్ 2 సినిమా చేస్తున్నారు. 2025 లోనే షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ 2026 రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు .. ఇక దీని తర్వాత ఎన్టీఆర్ తో నెల్సన్ సినిమా ఉండనుంది .. ఈలోపు వార్ 2 , ప్రశాంత్ నీల్ సినిమాలను కంప్లీట్ చేయనన్నాడు ఎన్టీఆర్.. ఇక జవాన్ తో 1000 కోట్ల హిట్ అందుకున్న అట్లీ .. సంవత్సరానికి పైగా మరో సినిమాని ప్రకటించలేదు .. బాలీవుడ్ లో ఓ బడా కాంబో సెట్ చేయాలని చూసినా వర్కౌట్ కాలేదు .. ఇక దాంతో అల్లు అర్జున్ పై తన ఫోకస్ పెట్టారు అట్లీ .. అలాగే డాన్ ఫెమ్ శిబి చక్రవర్తి . నాని మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్లో ఒక క్రేజీ సినిమా కూడా రానుంది .. ఇలా మొత్తానికి టాలీవుడ్ ను మెల్లగా తన గుప్పట్లోకి తీసుకుంటున్నారు తమిళ దర్శకులు.