టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో సినిమా అంటే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు ఉంటాయి. గతంలో రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ కాంబో మరోసారి కలిసి పనిచేయనున్నారు. పుష్పా లాంటి సాలిడ్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ తర్వాత సుకుమార్ రామ్ చ‌రణ్‌తో మరో సినిమాను తెర‌కెక్కించనున్నాడు. ఆర్ సి 17 రన్నింగ్ టైటిల్‌తో ఈ సినిమా సెట్స్‌ పైకి రానుంది. ఇప్పటికే దీనిపై అఫీషియల్ ప్రకట‌న‌ కూడా వచ్చేసింది. గేమ్ ఛేంజర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను చూశాడు రామ్ చరణ్. ఇక ఈసారి బుచ్చిబాబు సినిమాతో సాలిడ్ హిట్ ఇవ్వాలని పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. ఈక్రమంలో తన నెక్ట్ సినిమా లవిషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.

ఇప్పటికే ఆచార్య, గేమ్ ఛేంజర్ తో రెండు ప్లాప్ లు చూసిన చరణ్. నెక్ట్స్ హ్యాట్రీక్ ఫెయిల్యూర్ నుంచి తప్పించుకోవడం కోసం జాగ్రత్తపడుతున్నాడు. ఇక ఈక్రమంలోనే రామ్ చరణ్ నెక్ట్స్ సినిమాకు సబంధించిన  వార్తలు వైరల్ అవుతున్నాయి. అంచనాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమాపై చరణ్ కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నాడట. మరో క్లాసిక్ సినిమా సుక్కు తనకివ్వ‌నున్నాడని ఫిక్స్ అయ్యాడట. ఈ నేపథ్యంలోనే సుకుమార్ తో చర‌ణ్‌ డిస్కషన్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ వరకు పూర్తయిందని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం చరణ ఆర్సి16తో బిజీ బిజీగా గడుపుతున్నాడు. త్వరలోనే సినిమాను పూర్తి చేసి ఆర్ సి 17 సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు.


ఈ క్రమంలోనే రామ్ చరణ్ తో చేయబోయే సినిమాతో మరోసారి భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను స్టార్ట్ చేసిన సుకుమార్ ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి వరుసగా నాలుగో విజయాన్ని కూడా ఆడ్ చేసుకోవాలని చూస్తున్నాడు.ఇక ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్ లో రంగస్థలం అనే సినిమా వచ్చింది. ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న వీళ్లిద్దరూ మరోసారి అంతకు మించిన విజయాన్ని దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు రాబోతున్న సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఇక రామ్ చరణ్ తో ఫ్యామిలీ సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉంటాయి. దానికి ఏమాత్రం తగ్గకుండా యాక్షన్ ఎపిసోడ్స్ ని యాడ్ చేస్తూ, ట్విస్టులను కూడా భారీగా రంగరించి మరి ఈ సినిమా స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఈ క్రమంలోనే త్వరలో సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ రావచ్చని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: