
అఖండ 2 చివర్లో అఖండ 3 కి లీడ్ ఇస్తారట. అఖండ 2 లో కథ వేరే మలుపు తీసుకోగా పార్ట్ 2 పూర్తి స్థాయిలో ఆధ్యాత్మికతతో ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య అఘోరా రోల్ మరింత పవర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.ఇదిలావుండగా అఖండ 2 - తాండవం ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఇదిలావుండగా అఖండ 2' సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం కూడా విడుదల కానున్నది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కూడా థమన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదల కాబోతుందట.