
ఇక తొలి వారంలో వచ్చిన తండెల్ సినిమా ఫిబ్రవరి సెంటిమెంట్ ను రిపీట్ చేసింది .. నాగచైతన్య , సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది .. అలాగే నాగచైతన్య కెరీర్ లోనే తొలి 100 కోట్ల సినిమాగా నిలిచింది .. ఇక ఈ సినిమా కంటే ఒక్కరోజు ముందు తమిళ మూవీ పట్టుదల వచ్చి ఫ్లాఫ్ అయింది. ఇక రెండో వారంలో లైలా, బ్రహ్మానందం సినిమాలుచ్చాయి .. ఇక విశ్వక్ హీరోగా వాలెంటైన్స్ డే కన్ఫ్యూగా వచ్చిన లైలా సినిమా అతిపెద్ద డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది .. హీరో స్వయంగా అందరికీ సారీ చెబుతూ బహిరంగ లేఖ కూడా రాసారు అంటే ఈ సినిమా ఫలితం ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఇక బ్రహ్మానందం, రాజ గౌతమ్, వెన్నెల కిషోర్ కలిసి నటించిన బ్రహ్మానందం మంచి ప్రయత్నంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈ సినిమా ధియేటర్లో ఆడలేకపోయింది.. ఇదే వారంలో లవర్స్ డే కనుక ఆరెంజ్, ఇట్స్ కాంప్లికేటెడ్ లాంటి రీ- రీలీజ్‌లు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఇక మూడో వారంలో డబ్బింగ్ సినిమాలు హవా కొంత కనిపించింది . జాబిలమ్మ నీకు అంత కోపమా, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ వంటి సినిమాలు తో పాటు బాపూ , రామం రాఘవం లాంటి తెలుగు సినిమాలు కూడా వచ్చాయి .. ఇక వీటిలో బాపు సినిమా గురించి కొంత ప్రత్యేకంగా చెప్పుకోవాలి .. మరో బలగం అవుతుందని అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా తొలి రోజే దుకాణం సద్దేసింది.. రామం రఘువం కూడా మెప్పించలేకపోయింది. ఇక డబ్బింగ్ సినిమాల్లో ధనుష్ దర్శకత్వం వహించిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా మెప్పించలేకపోయింది .. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా మొదటి వీకెండ్ ఓకే అనిపించినా తర్వాత చతికెల పడింది. ఇక ఆఖరి వారంలో వచ్చిన మజాకా సినిమా .. కొంచమే మజాను పంచగా.. ఆది పినిశెట్టి శబ్దం అంటూ వచ్చే నిరాశపరిచాడు .. ఇలా మొత్తంగా ఫిబ్రవరి నెలలో రీ- రీలీజస్‌తో కలిపి మొత్తం 21 సినిమాలు వచ్చాయి . అందులో తండేల్ సినిమా హిట్ అనిపించుకుని మరోసారి ఫిబ్రవరి సెంటిమెంట్ ను ముందుకు తీసుకువెళ్లింది.