బాలీవుడ్ నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి పూనమ్ పాండే. చేసింది తక్కువ చిత్రాలు అయినప్పటికీ కూడా అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో తన క్రేజ్ పెంచుకుంది. ముఖ్యంగా ఈమె షేర్ చేసే ఫోటోలతో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజీ సంపాదించుకున్నది. పూనమ్ పాండే 2011లో వరల్డ్ కప్ టీమిండియా గెలిస్తే మైదానంలో తాను నగ్నంగా తిరుగుతాను అంటూ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా కొన్ని అవేర్నెస్ వంటి వాటిని కూడా తెలియజేస్తూ ఉంటుంది.


ఇటీవలే గర్భాశయం ముఖద్వారా క్యాన్సర్ పైన ఇమే అవగాహన కల్పించడం కోసం ఏకంగా తనని తాను మరణించినట్లుగా కొన్ని పోస్టులను పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది పూనమ్ పాండే.. అయితే ఇదంతా కూడా కేవలం అవగాహన కోసమే అంటూ తెలపడంతో చాలామంది ఈమెను విమర్శించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇటీవలే ఒక వ్యక్తి నడిరోడ్లో ఈమెతో ఫోటో దిగడం కోసం ప్రయత్నించగా ఆ వ్యక్తి ఆమెకు ముద్దు పెట్టడానికి కూడా ట్రై చేయడంతో వెంటనే ఆ వ్యక్తి నుంచి తప్పించుకుంది.


ఇలా పర్సనల్ లైఫ్ లోనే కాకుండా ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతుంది. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పూనమ్ పాండే రెండవ పెళ్లి పైన పలు వ్యాఖ్యలు చేసింది.. ఇప్పటికే పెళ్లి చేసుకున్న పూనమ్ తన భర్త నుంచి విడిపోయింది..రెండో పెళ్లి పైన మాట్లాడుతూ రెండేళ్లుగా తాను ఒంటరిగా ఎంతో ఆనందంగా జీవిస్తున్నానని వైవాహిక జీవితం తనకు కలిసి రాలేదనిపిస్తోందంటూ తెలిపింది. ఏది ఏమైనా ఇప్పుడు హాయిగా జీవిస్తున్నానని నాకు అందమైన కుటుంబం మంచి కెరియర్ ఉన్నదని ఈ రెండిటితో తాను ఆనందంగా హ్యాపీగా ఉన్నాను అంటూ తెలిపింది.. మళ్లీ పెళ్లి అంటే భయంగా ఉందని ఎవరేంటో తెలుసుకోలేక పోతున్నానని ఎవరిని నమ్మాలో తెలియడం లేదు కాబట్టి రెండో పెళ్లి ఇప్పట్లో ఆలోచన లేదంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: