దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో జెడి చక్రవర్తికి ఎంతో మంచి అనుబంధం ఉంది. అలాంటి మంచి అనుబంధంతో ఉన్న వీరిద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది అని చాలా మందిలో ఒక అనుమానం అయితే రావచ్చు. ఇక మరికొంత మందేమో అదంతా ఎవరో క్రియేట్ చేసిన రూమర్ అని అనుకుంటారు. కానీ ఇది రూమర్ అయితే కాదు. ఎందుకంటే స్వయంగా జెడి చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు. మరి ఇంతకీ జెడి చక్రవర్తికి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కి మధ్య గొడవ ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం. రాఘవేంద్రరావు జె.డి చక్రవర్తి కాంబినేషన్లో బొంబాయి ప్రియుడు సినిమా వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా రంభ నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ చివరికి వచ్చిన సమయంలో వీళ్లు మారిషస్ లో ఈ షూటింగ్ని ముగించాలని అనుకున్నారు.

 అలా షూటింగ్ చివరి రోజు జె.డి చక్రవర్తి తల్లికి అనారోగ్యంగా ఉండడంతో మారిషస్ లోని హాస్పిటల్ కి తరలించారు.అయితే మారిషస్ రూల్స్ ప్రకారం పేషంట్ ని ఎవరైతే హాస్పిటల్ కి తీసుకు వస్తారో మళ్ళీ ఆ వ్యక్తే వచ్చి డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్లాలి . అలా ఆరోజు హాస్పిటల్ కి జె.డి చక్రవర్తి తల్లిని డ్రైవర్ తీసుకువెళ్లారు. అయితే షూటింగ్ ముగించుకోని డిశ్చార్జ్ చేశాక ఎయిర్పోర్ట్ కి వెళ్లి తిరిగి ఇండియాకి వెళ్లి పోదాం అనుకున్నారట జెడి చక్రవర్తి. ఇక అదే సమయంలో జె.డి చక్రవర్తి డ్రైవర్ని తన తల్లిని తీసుకురామని చెప్పాడట.కానీ డ్రైవర్ మాత్రం వినకుండా అక్కడే ఉన్నారట. ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాలి. వెళ్లి మా అమ్మని తీసుకురా అంటే లేదు సార్ రాఘవేంద్రరావు గారు రంభ వాళ్ళ అమ్మని షాపింగ్  కి తీసుకెళ్లమని చెప్పారు. నేను అటే వెళ్తున్నాను అని అన్నారు.

దాంతో ఇక్కడ హాస్పిటల్ లో ఉన్న మా తల్లి కంటే షాపింగ్ లు ఎక్కువా అని కోపంతో జెడి చక్రవర్తి తాను వేసుకున్న జాకెట్ ని విసిరికొట్టి అక్కడ నుండి వెళ్లిపోయారట. అయితే ఇదంతా గమనించిన రాఘవేంద్రరావు ఎందుకు ఇంత పెద్ద గొడవ చేస్తున్నాడు జె.డి చక్రవర్తి. ఆయన అలా కోపంగా ఉండడం నేను ఇప్పటివరకు చూడలేదు అని బాధపడ్డారట. షూటింగ్ కూడా ఆగిపోయే స్టేజ్ కి వచ్చిన సమయంలో వెంటనే వారిద్దరి మధ్య గొడవని ఆపడానికి చాలామంది ట్రై చేశారు. కానీ చివరికి డాన్స్ మాస్టర్ సుచిత్ర చంద్రబోస్ వారిద్దరి మధ్యలో కల్పించుకొని జెడి చక్రవర్తి కి సర్ది చెప్పిందట.ఆమె మాటకి విలువిచ్చిన జెడి షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్లే సమయంలో రాఘవేంద్రరావు వచ్చి నాకు మీ అమ్మ హాస్పిటల్ లో ఉన్న సంగతి తెలియదు. తెలియకపోవడం వల్లే నేను రంభ తల్లిని షాపింగ్ కి తీసుకెళ్లమని చెప్పాను అని సారీ చెప్పారట. దానికి జె.డి చక్రవర్తి కూడా సైలెంట్ అయ్యారట.అయితే ఈ విషయాన్ని ఎప్పుడు కలిసినా కూడా రాఘవేంద్రరావు చెప్పి ఫన్నీగా రియాక్ట్ అవుతారు అంటూ జెడి చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: