
ప్రముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ లలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటన వెలువడింది. అయితే ప్రముఖ పైరసీ వెబ్ సైట్లు మాత్రం ఈ సినిమా హెచ్డీ ప్రింట్ ను ముందుగానే అందుబాటులోకి తీసుకొనిరావడం గమనార్హం. తండేల్ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన సంస్థకు ఇది షాకేనని చెప్పవచ్చు.
తండేల్ సినిమా వెండితెరపై సంచలనాలు సృష్టించగా ఈ సినిమా ఓటీటీలో సైతం సంచలనాలను కొనసాగించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తండేల్ సినిమా ఇతర భాషల ప్రేక్షకులను మెప్పించగా నాగచైతన్య మార్కెట్ ను ఈ సినిమా పెంచిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. తండేల్ సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉన్నాయి.
నాగచైతన్య కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే భవిష్యత్తులో ఈ హీరో ఖాతాలో మరిన్ని విజయాలు చేరడం పక్కా అని చెప్పవచ్చు. నాగచైతన్య రెమ్యునరేషన్ 10 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నాగచైతన్య కార్తీక్ దండు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా ఒకింత భారీ స్థాయిలో తెరకెక్కుతుండటం గమనార్హం. నాగ చైతన్యకు నార్త్ లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.