టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్యకు ఉన్న ఫాలోయింగ్ అంతా అంతా కాదు. అక్కినేని నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకొని... ఇండస్ట్రీలో రాణిస్తున్న అక్కినేని నాగచైతన్య... ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకోవడమే కాకుండా... ఉన్నత శిఖరాలకు ఎదిగారు. అయితే... అలాంటి అక్కినేని నాగచైతన్య తాజాగా తండెల్ అనే రియల్ స్టోరీ తో... తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. టాలీవుడ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో వివాహం అయిన తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేయించారు అక్కినేని నాగచైతన్య.

 అంతకుముందు అక్కినేని నాగచైతన్య వరుసగా అట్టర్ ప్లాఫ్ లను ఎదుర్కొన్నాడు. దాదాపు రెండు మూడు సినిమాలను.. డిజాస్టర్ గా తన ఖాతాలో వేసుకున్నాడు అక్కినేని నాగచైతన్య. అయితే తెలివిగా ఈ సినిమాలోకి సాయి పల్లవిని తీసుకువచ్చిన చిత్ర బృందం... గ్రాండ్గా తెరకు ఎక్కించింది. ఈ సినిమాలో... అక్కినేని నాగచైతన్య హీరోగా నటించగా అతని సరసన సాయి పల్లవి... అదరగొట్టింది.

 అయితే... లవర్స్ డే సందర్భంగా... వారం రోజులు ముందుగానే ఈ సినిమాను ఫిబ్రవరి ఏడో తేదీన రిలీజ్ చేశారు. ఆ సమయంలో ఏ సినిమా కూడా థియేటర్లోకి రాలేదు. దీంతో అక్కినేని నాగచైతన్య నటించిన... తండేల్ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసుకుంది.  ఈ సినిమా ఇప్పటివరకు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందని చెబుతున్నారు. తండెల్ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

 వాస్తవ కథను ఆధారంగా చేసుకొని పూర్తి సినిమాను చాలా బ్రహ్మాండంగా తెరకెక్కించారు దర్శకుడు చందు. జనాలకు కూడా ఈ స్టోరీ నచ్చడంతో మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మార్చి ఏడో తేదీన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అంటే సరిగ్గా నెల రోజులకే ఈ సినిమాను తీసుకువస్తున్నారు. తెలుగు ఒక్క భాషలోనే కాకుండా హిందీ మలయాళం కన్నడ, తమిళ భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: