సంక్రాంతికి వస్తున్నాం మూవీ వెండితెరపై సంచలనాలను సృష్టించగా నిన్న ఈ సినిమా బుల్లితెరపై ప్రసారమైన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఈ సినిమా జీ5 ఓటీటీలో సైతం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఓటీటీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
 
ఆర్ఆర్ఆర్ హనుమాన్ రికార్డులను సైతం ఈ సినిమా బ్రేక్ చేసింది. ఈ రెండు సినిమాలు సైతం జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలను మించి సంక్రాంతికి వస్తున్నాం హిట్ గా నిలిచిందంటే ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగా నచ్చేసిందో అర్థమవుతోంది. జీ5 ఓటీటీలో ఈ సినిమాకు ఏకంగా 13 లక్షల వ్యూస్ వచ్చాయని సమాచారం అందుతుండటం గమనార్హం.
 
కేవలం 12 గంటల్లో ఈ సినిమాకు 100 మిలియన్లకు పైగా వ్యూ మినిట్స్ వచ్చాయని భోగట్టా. సంక్రాంతికి వస్తున్నాం మూవీ నిర్మాత దిల్ రాజుకు సైతం కాసుల వర్షం కురిపించిందనే సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేశ్ కెరీర్ కు సరైన సమయంలో సరైన సినిమా పడింది. గత కొన్నేళ్లుగా వెంకీ ఖాతాలో హిట్లు చేరుతున్నా ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం చేరలేదనే సంగతి తెలిసిందే.
 
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి కెరీర్లకు ప్లస్ అయింది. విక్టరీ వెంకటేశ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పెద్దగా ట్విస్టులు లేకపోయినా కథనం అద్భుతంగా, కొత్తగా ఉండటం ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయిందని కచ్చితంగా చెప్పవచ్చు. విక్టరీ వెంకటేశ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఇతర భాషల్లో సైతం రీమేక్ అవుతోందని సమాచారం అందుతుండటం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: