ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు సడన్ గా అస్వస్థత కు గురై హాస్పిటల్లో చేరుతున్నారు.. అలా ఇప్పటికే పలుమార్లు హాస్పిటల్ బారిన పడిన డైరెక్టర్ వి.వి.వినాయక్ మళ్లీ హాస్పిటల్ లో చేరారు. ఇక ఈయన హాస్పిటల్ లో చేరినట్టు ఓ వార్త మీడియా లో లీక్ అవ్వడంతోనే చాలా మంది నెటిజన్లు వి.వి.వినాయక్ కి ఏమైంది అని గాబరా పడుతున్నారు. మరి ఇంతకీ డైరెక్టర్ వి. వి.వినాయక్  కి ఏమైంది.. ఎందుకు ఆయన హాస్పిటల్ కి వెళ్లారు అనేది ఇప్పుడు చూద్దాం.. కొంత మంది సెలబ్రిటీలు రెగ్యులర్ చెకప్స్ కోసం హాస్పిటల్ కి వెళ్తూ ఉంటారు. కానీ అలా వెళ్ళిన సమయం లో వారికి ఏదో అయింది అనే వార్తలు క్రియేట్ చేస్తూ ఉంటారు. 

అయితే మళ్లీ ఆ సెలబ్రెటీలు క్లారిటీ ఇచ్చేవరకు ఆ వార్తలు ఆగవు.. అలా తాజాగా వివి వినాయక్ ఆసుపత్రి లో చేరారు. దానికి కారణం రీసెంట్ గా వి.వి.వినాయక్ అనారోగ్యం బారిన పడటంతో ఆయన్ని కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించారు. దాంతో ఆయన లివర్ చెడిపోయిందని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. అయితే కొద్ది రోజులు బాగానే ఉన్న వి.వి. వినాయక్ ఆరోగ్యం మళ్లీ కాస్త అస్వస్థత కు గురవ్వడంతో ఇంట్లో వాళ్ళు ఆయన్ని హాస్పిటల్ కి తరలించారు.

ప్రస్తుతం వివి వినాయక్ ఎక్స్పర్ట్ వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక ఈయన హాస్పిటల్ కి వెళ్ళిన విషయం తెలుసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ సుకుమార్ అక్కడి కి  వెళ్లి ఆయన్ని పరామర్శించారు. ప్రస్తుతానికి ఆయన హెల్త్ గత కొద్దిరోజులుగా బాగాలేకపోవడంతో ఆయన రెస్ట్ మోడ్ లోనే ఉంటున్నారు. హాస్పిటల్ నుండి వచ్చాక కూడా మళ్లీ రెస్ట్ మోడ్ లోనే ఉంటారని తెలుస్తోంది.ఇక సినిమాల విషయానికొస్తే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఛత్రపతి మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేసి భారీ డిజాస్టర్ అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: