హాస్య నటుడు సప్తగిరి సినిమా అంటే అందరూ కడుపుబ్బా నవ్వుకుంటారు. ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి మంచి కామోడియన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. సప్తగిరి గురించి కొత్తగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు ఉన్న హాస్య కళతో ఎంతో మందిని నవ్వించి మంచి గుర్తింపును తన సొంతం చేసుకున్నాడు. సప్తగిరి సైడ్ పాత్రలలో నాటిస్తూనే.. అప్పుడప్పుడు హీరో వేషాలు కూడా వేస్తున్నాడు. ఇప్పటికే సప్తగిరి గూడుపుఠాణి, సప్తగిరి ఎల్ఎల్ బి, సప్తగిరి ఎక్స్ ప్రెస్ వంటి సినిమాలలో ముఖ్య పాత్రలో నటించాడు. తాజాగా సప్తగిరి పెళ్లి కాని ప్రసాద్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కి ఉన్న క్రేజ్ టాలీవుడ్ లో ఏ హీరోకి లేదు. ప్రభాస్ అంటే చాలు ప్రాణాలు ఇచ్చే అంతా ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. ప్రభాస్ ని టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ డార్లింగ్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు. గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఇండియా లోనే కాదు.. ఇతర దేశాలలో కూడా పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి ఏ సినిమా చేసినా పాన్ ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది.
ఇక ఈ మూవీ టీజర్ ని త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రానున్నారు. పెళ్లి కాని ప్రసాద్ సినిమాను ప్రభాస్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సప్తగిరి సోషల్ మీడియా వేదికగా 'పెళ్లి కాని ప్రసాద్ కోసం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మన డార్లింగ్ రాజా సాబ్ వస్తున్నాడు' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: