ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఓటీటీలు వచ్చినప్పటినుండి చాలా మంది థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడడం మానేశారు.    ఇక ఈ వారం థియేటర్ లలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలాగే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కూడా చాలానే సినిమాలు  స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే అందులో ఒక సినిమా మాత్రం ఇప్పటికే థియేటర్ లో హ్యట్రిక్ హిట్ కొట్టి మంచి కలెక్షన్ ని సొంతం చేసుకోగా.. ఇప్పుడు మరోసారి ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యి దుమ్మురేపుతుంది. మరి ఆ సినిమా ఏంటో.. ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం..
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్నాం మూవీ హ్యాట్రిక్ కొట్టేసింది. ఈ సినిమాలో హీరోయిన్లు గా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు.  సంక్రాంతి పండుగ సందర్భంగా 'సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గ్రాండ్ రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సంక్రాంతి హిట్ అయ్యి.. రూ. 106 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటింది. ఇక ఇప్పుడు జీ5 ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాను కేవలం 12 గంటల్లోనే దాదాపు 13 లక్షల మంది చూశారు.
ఇక ఈ వారం థియేటర్ లలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాకు దర్శకుడు త్రినాథరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరించారు. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న విడుదల అయిన ఈ సినిమాకు హీరోయిన్ గా రీతువర్మ నటించింది. అలాగే అగాధియా సినిమా, శబ్దం మూవీ కూడా పోయిన నెల 28న విడుదల అయ్యాయి. తకిట తదమి తందాన మూవీ, రాక్షస సినిమా కూడా ప్రస్తుతం థియేటర్ లలో ఆడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: