టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా పేరు పొందిన మీనాక్షి చౌదరి ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎం పవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు నిన్నటి రోజు నుంచి ఎక్కువగా సోషల్ మీడియాలో పలు రకాల విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయాన్ని చాలా చానల్స్ కూడా ప్రచారం చేయడం జరిగింది. వాస్తవానికి మీనాక్షి చౌదరి ఈ విషయం పైన ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వకపోయినా ఏపీ ప్రభుత్వమే సోషల్ మీడియా వేదికలో ఈ న్యూస్ పైన స్పందించడం జరిగింది.


సోషల్ మీడియా పాపులారిటీ కూడా మీనాక్షి చౌదరికి భారీ గానే పెరగడంతో పాటుగా వరుస విజయాలతో దూసుకుపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ గా ఈమెను నియమించారనే విధంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఏపీ గవర్నమెంట్ సోషల్ మీడియా ఖాతా నుంచి ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. మీనాక్షి చౌదరి పైన వస్తున్న వార్తలన్నీ కూడా ఫేక్ ప్రచారం అంటూ కొట్టి పారేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో అభిమానులు కూడా నిరాశతో ఉన్నారు.


మరి కొంతమంది మాత్రం ఇది కావాలని కేవలం ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తూ ఉన్నారని వీరిపైన కచ్చితంగా ప్రభుత్వం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అంటూ ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తోంది. మరి మీనాక్షి చౌదరి పైన వినిపిస్తున్న ఈ ఫేక్ ప్రచారానికి బ్రేక్ పడింది. మీనాక్షి చౌదరి సినిమాల విషయానికి వస్తే ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నది.. ఈమె చేతుల అనగనగా ఒక రాజు, విశ్వంభర వంటి చిత్రాలు ఉన్నాయి మరి ఈ సినిమాలతో మంచి విజయాన్ని అందుకుంటే ఈ ముద్దుగుమ్మ కూడా టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్గా పేరు సంపాదిస్తుంది. మొదట ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది మీనాక్షి చౌదరి.

మరింత సమాచారం తెలుసుకోండి: