
అయితే ఎవ్వరు కూడా అలా సాహసం చేయరు . అది కూడా పాన్ ఇండియా హీరోలు అయితే అసలు అలాంటి పాత్ర వస్తే రిజెక్ట్ చేసి పడేస్తారు. కానీ బన్నీ మాత్రం చాలా చాలా డేరింగ్ గా ముందుకెళ్లాడు . కాగా సోషల్ మీడియాలో ఇప్పుడు బన్నీకి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. సాధారణంగా బన్నీ ఎక్కువగా అగ్రిసీవ్ అవ్వడు . ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు . అయితే అలాంటిబన్నీ కోపం వస్తే ఏం చేస్తాడు అనే విషయం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది.
అల్లు అర్జున్ కి సాధారణంగా త్వరగా కోపం రాదు . ఒకవేళ వస్తే మాత్రం అందరిలాగా అరవకుండా చాలా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారట . కూల్ డౌన్ అవుతూ అసలు ప్రాబ్లం ఏంటి..? ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి..? అనే విధంగానే ఆలోచిస్తాడట . అంతేగాని పక్కన ఉన్న వస్తువు పగలకొట్టడం.. అరవడం లాంటివి అస్సలు చేయడట . అందుకే బన్నీ లైఫ్ ఇలా మారిపోయింది అంటున్నారు ఫ్యాన్స్. నిజానికి బన్నీ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు బాగా కోపడిపోయేవారట. కానీ ఇప్పుడూ మాత్రం తన పద్ధతులు మార్చుకుంటున్నాడట..!