ఏంటి బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నిజంగానే ఇండియాని అవమానించిందా.. ఎందుకు భారత్ కి అవమానం జరిగింది అని ఆమె మాటలు విన్న నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా గత ఏడాది సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే మొదట్లో వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని కానీ ఆ తర్వాత ఒప్పుకున్నారనే వార్తలు వినిపించాయి. అలాగే పెళ్లయ్యాక సోనాక్షి సిన్హ మతం మారుతుంది అనే రూమర్లు కూడా వినిపించాయి.కానీ ఈ రూమర్లపై సోనాక్షి సిన్హా దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. నేను ఎప్పుడూ కూడా మతం మారాలి అని ఆలోచనకి రాలేదు. అలాగే మా మధ్య మతం గురించి టాక్ కూడా రాదు. ఆయన హిందువుల పండుగలు నేను ముస్లిం పండుగలు చేసుకుంటూ ఉంటాం అంటూ మాట్లాడింది.

ఇక రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి సిన్హా మాట్లాడుతూ..నేను భారత్ లో స్విమ్ సూట్ వేసుకొని స్విమ్మింగ్ అస్సలు చేయను. బికినీ కూడా ధరించను.ఇక్కడ స్విమ్ సూట్స్ వేసుకొని,బికినీలు ధరిస్తే మాత్రం ఎవరు ఎక్కడినుండి ఫోటోలు తీస్తారో తెలియదు. ఆ భయంతోనే నేను భారత్ లో స్విమ్మింగ్ సూట్లు వేసుకొని స్విమ్మింగ్ చేయను బికినీలు ధరించను.కానీ ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మాత్రమే స్విమ్మింగ్ సూట్స్ వేసుకొని స్విమ్మింగ్ చేస్తాను బికినీలు ధరిస్తాను అక్కడ ఏం చేసినా పర్వాలేదు అన్నట్లుగా భారత్ ను అవమానిస్తూ విదేశాలను మెచ్చుకున్నట్లుగా మాట్లాడింది.ఇక సోనాక్షి సిన్హా మాటలపై చాలామంది నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

భారత్లో బికినీలు వేసుకుంటే ఫోటోలు తీస్తారని భయం ఉంటే ఇతర దేశాల్లో వేసుకున్న బికినీ ఫోటోలు ఎందుకు షేర్ చేస్తున్నావ్.ఆ ఫొటోస్ షేర్ చేస్తే మాత్రం బయట వైరల్ అవ్వవా.. ఇండియా జనాలు చూడరా.. నీకు అంతలా ఇతర దేశాల మీద ప్రేమ ఉన్నప్పుడు అక్కడే ఉండు. ఇండియన్స్ మైండ్ సెట్ బాగాలేదు అన్నట్టుగా విదేశాల్లో ఉన్న వారి మైండ్ సెట్ బాగుంది అంటే అక్కడే ఉండు. ఇండియాలో అంత ఇబ్బందిగా ఉంటే బురఖా వేసుకొని తిరుగు అని కామెంట్లు పెడుతున్నారు. మరికొంత మందేమో ఒక అడుగు ముందుకు వేసి బురఖా ధరించి మతం మార్చుకొని పాకిస్తాన్ కి వెళ్లి జీవించు అంటూ ఫైర్ అవుతున్నారు.మరి సోనాక్షి సిన్హా ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: