టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలలో హీరోగా నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ వస్తున్నాయి. దానితో ఈయన కెరియర్ గ్రాఫ్ కూడా ఈ మధ్య కాలంలో కాస్త పడిపోయింది.

ఆఖరుగా ఈయన పరశురాం పెట్లా దర్శకత్వంలో రూపొందిన ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో మృనాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్డమ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ కొంత కాలం క్రితం ప్రకటించాడు. ఇకపోతే ఈ సినిమా నుండి కొన్ని రోజుల క్రితం మూవీ మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ఇకపోతే ఈ సినిమా మొదటి భాగం కు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్నట్లు , మరో పది రోజుల్లో ఈ మూవీ మొదటి భాగం మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ ని మే 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చెప్పిన తేదీకి ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd