సూపర్ స్టార్ మహేష్ బాబు సుద్దపూసేం కాదు. ఆ హీరోయిన్ తో ఎఫైర్ నడిపాడు అంటూ ఓ డైరెక్టర్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఎంతో సింపుల్ గా ఇప్పటివరకు హీరోయిన్ల వివాదాల్లో ఇరుక్కుని మహేష్ బాబు ఎవరితో ఎఫైర్ నడపారు..ఇంతకీ మహేష్ బాబుకి ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉంది అన్నట్టుగా మాట్లాడిన ఆ డైరెక్టర్ ఎవరూ అనేది ఇప్పుడు చూద్దాం.. పలు ఇంటర్వ్యూలలో వివాహస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటున్న డైరెక్టర్ గీతాకృష్ణ అంటే తెలియని వారు ఉండరు. ఆయన ఇప్పటికే ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో హీరో హీరోయిన్లపై డైరెక్టర్లపై వివరస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే.

అయితే గతంలో మహేష్ బాబు గురించి గీతాకృష్ణ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఇంతకీ మహేష్ బాబుకి ఏ హీరోయిన్ తో ఎఫైర్ ఉందో ఇప్పుడు చూద్దాం. గతంలో మహేష్ బాబు త్రిష మధ్య ఎఫైర్ ఉందని, ఈ ఎఫైర్ విషయం తెలిసే నమ్రత త్రిషకి వార్నింగ్ ఇచ్చింది అంటూ కొన్ని వార్తలు వచ్చాయి.మహేష్ బాబు, త్రిష కాంబోలో అతడు, సైనికుడు వంటి రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాల్లో అతడు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.. సైనికుడు సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

అయితే ఈ సినిమాల్లో చేసిన సమయంలో త్రిషతో మహేష్ బాబు ఎఫైర్ నడిపాడని ఆయనేం సుద్దపూస కాదు అని ఈ విషయం తెలిసి నమ్రత ఇద్దరిపై ఫైర్ అయ్యి త్రిషకి వార్నింగ్ ఇచ్చిందని, అందుకే మరో సినిమాలో కూడా ఈ జోడి కలిసి నటించాల్సి ఉండగా నమ్రత వార్నింగ్ తో త్రిష ఆ సినిమాని రిజెక్ట్ చేసింది అంటూ డైరెక్టర్ గీతాకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే డైరెక్టర్ మాట్లాడిన పాత వీడియో మళ్లీ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొట్టడంతో నిజంగానే మహేష్ బాబుకి త్రిష తో ఎఫైర్ ఉందా? ఒకవేళ అందులో నిజం లేకపోతే ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్ ఆయన గురించి ఈ విషయం ఎందుకు బయటపెడతారు అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: