పోసాని కృష్ణమురళిని తాజాగా ఏపీ పోలీసులు అరెస్టు చేసి జైల్లో ఉంచిన సంగతి మనకు తెలిసిందే.అయితే రీసెంట్గా ఆయన గుండె నొప్పి అని చెప్పి హాస్పిటల్ లో చేరారు. కానీ ఆ తర్వాత అదంతా డ్రామా అంటూ పోలీసులు మళ్ళీ జైలుకు తీసుకువెళ్లారు. ఈ విషయం పక్కన పెడితే.. పోసాని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో ప్రెస్మీట్లో ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలా గతంలో ఈయన ఇరుక్కున్న ఓ వివాదం గురించి స్వయంగా ఆయనే బయటపెట్టారు.అదేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. పోసాని కృష్ణ మురళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను సినిమాల్లో నటుడుగా రాకముందు పరుచూరి బ్రదర్స్ దగ్గర వర్క్ చేసేవాడిని. వారిని నేను ప్రేమతో అన్నా అని పిలుచుకునే వాడిని.అయితే ఓ రోజు పరుచూరి రవి నా దగ్గరికి వచ్చి నా ఫ్రెండ్ వాడి లవర్ తో ఇంట్లో నుండి బయటకు వచ్చాడు. ఆమె పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురు.

కానీ ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో రెండు రోజులు నీ రూమ్ లో ఉండి వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు అని నాతో చెప్పారు. కానీ నేను నమ్మలేదు. ఇక బయటికి వెళ్లి చూస్తే ఆయన రవితేజ తమ్ముడు భరత్. రవితేజ తమ్ముడు భరత్ చాలా అందంగా ఉంటాడు.కానీ ఈ విషయంలో నేను ఆలోచించుకొని వద్దు ఈ విషయం నాన్న వాళ్లకి తెలిస్తే ఇబ్బందులు అవుతాయి.నా రూమ్ లో ఉంచకు అని చెప్పాను.కానీ పరుచూరి రవి మాత్రం నువ్వు ముందుగా వారితో రెండు నిమిషాలు మాట్లాడు వారి ప్రవర్తన ఎలా ఉందో గమనించి నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పాడు. దాంతో భరత్ అలాగే ఆ అమ్మాయి ఇద్దరితో నేను రెండు నిమిషాలు మాట్లాడాను. కానీ వాళ్ళిద్దరూ చాలా చక్కగా మాట్లాడారు.

 అలాగే ఆ అమ్మాయి కూడా చాలా పద్ధతిగా ఉంది.ఇక నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు కావచ్చు అని నమ్మి నా రూం ఇచ్చాను.అయితే ఈ విషయం ఎవరో బయటకి లీక్ చేసి పోసాని కృష్ణ మురళి అమ్మాయిని తెచ్చుకొని రూమ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు.మద్యం తాగుతున్నాడు అంటూ క్రియేట్ చేశారు. అలాగే  పరుచూరి బ్రదర్స్ కి కూడా ఈ విషయం చెప్పారు.దాంతో వాళ్ళు అసలు నిజం ఏంటో తెలియకుండానే నన్ను వాళ్ళ దగ్గర ఉద్యోగం నుండి తీసేశారు. రవితేజ తమ్ముడు ఓ అమ్మాయిని తీసుకువచ్చి నా రూమ్ లో వాడుకున్నాడు.ఈ విషయం నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. అలా ఆరోజు గుడ్డిగా నమ్మి వివాదంలో ఇరుక్కున్నాను అంటూ పోసాని కృష్ణ మురళి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక అప్పట్లో ఈయన మాట్లాడిన మాటలు మీడియాలో చాలా వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: