బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. మారియన్ 2 అనే చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ల మిస్టర్ బచ్చన్, చిత్రంలో నటించిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన తన గ్లామర్ తో మాత్రం పేరు సంపాదించింది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటున్న భాగ్యశ్రీ బోర్సే పలు చిత్రాలలో నటించే అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం ఇమే కింగ్ డం, కాంత వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నదట



అయితే తన చిన్న వయసులో జరిగిన కొన్ని సంఘటనలను సైతం గుర్తుకు తెచ్చుకుంటూ పలు విషయాలను తెలియజేసింది. తాను చిన్న వయసులో కాస్త లావుగా ఉండే దానిని దీంతో టీనేజ్ కి వచ్చేసరికి మరింత బరువు పెరిగాను.. తన తల్లి డాన్స్ టీచర్ అవ్వడం వల్ల ఇతర పిల్లలతో పాటు తనకు కూడా డాన్స్ నేర్పిస్తూ ఉండేదని తాను లావుగా ఉండడం వల్ల డాన్స్ సరిగ్గా వేయలేకపోయానని.. అలా తోటి పిల్లలు తనని చాలాసార్లు ఎగతాళి చేశారని తెలిపింది. దీంతో ఎలాగైనా డాన్స్ నేర్చుకోవాలని ఒక లక్ష్యంతోనే పెట్టుకున్నానని వెల్లడించింది భాగ్యశ్రీ.


అలా కెరియర్లో కాలేజీలో వెళుతున్న సమయంలో డాన్స్ చేస్తూ వెళ్తూ ఉండగా కాలుజారి బురదలో పడ్డానని దీంతో అక్కడున్న వారందరూ చూసి పగలబడి నవ్వారని ఆ సంఘటన తనకి ఇప్పటికీ అసౌకర్యంగా అనిపించిందని తెలిపింది. ఇక భాగ్యశ్రీ స్పోర్ట్స్ ఉమెన్ గా కూడా పేరు సంపాదించింది. అందుకే ఈమె చదువులో కంటే ప్లే గ్రౌండ్ లోనే ఎక్కువగా ఉండేదట. చదువులో కూడా మంచి మార్కులే సంపాదించుకున్నదని.. ఈమెకు బాస్కెట్బాల్, కోకో, త్రో బాల్, రన్నింగ్ ఇతరత్రా వాటిలలో కూడా ముందుండేదట. ఎక్కువ ఖాళీ సమయం దొరికితే ఇమే అడవులను చుట్టేస్తూ ఉంటుందట భాగ్యశ్రీ. మరి టాలీవుడ్ లో ఈసారైనా అదృష్టం వారిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: