
గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి . అయితే రీసెంట్ గానే ప్రభుత్వం దానిపై క్లారిటీ ఇచ్చింది . అది ఫేక్ అంటూ చెప్పుకొచ్చింది. ఇలాంటి టైం లోనే మీనాక్షి చౌదరి ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. అసలు మీనాక్షి చౌదరిని ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు..? ఆమె ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయింది అని ఎవరికి చెప్పలేదు..? ఆ వార్తలు సోషల్ మీడియా ద్వారా ట్రెండ్ అయ్యాయి. వైరల్ అయ్యాయి.
ఇప్పుడు గవర్నమెంట్ అది ఫేక్ అంటూ చెప్పింది . దీనిలో మీనాక్షి చౌదరి తప్పేం లేదు కదా ..? మరి ఎందుకు ఆమె ఫేస్ కి అంత సీన్ లేదు అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు . నిజంగా ఇది న్యాయమే అని మీరు అనుకుంటున్నారా.. మీనాక్షి చౌదరి ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చిందో వాళ్లకి తెలియదా అంటూ మీనాక్షి చౌదరి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆమె ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది అని ఆ పేరును మాత్రం చెడగొట్టొద్దు అంటూ చెప్పుకొస్తున్నారు . కొందరు దారుణంగా కూడా శాపనార్ధలతో తిట్టిపోస్తున్నారు. మీనాక్షి చౌదరి పేరు ఇండస్ట్రీలో మరోసారి ట్రెండ్ అవుతుంది..!