
అయితే తెర వెనుక ఏం జరిగిందనే ప్రశ్నకు మాత్రం ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం టీడీపీకి చెందిన నేత ఒకరు మీనాక్షి చౌదరి సంబంధీకులకు ఈ విషయం చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. ఆ విధంగా ఈ వార్త సినిమా రంగానికి సంబంధించిన కొంతమందిని సైతం చేరిందని సమాచారం అందుతోంది.
వాస్తవానికి మీనాక్షితో పాటు రష్మిక, సాయిపల్లవి పేర్లను సైతం ఏపీ విమెన్ ఎంపవర్మెంట్ పదవి కోసం పరిశీలించారు కానీ వీళ్లు తెలుగు వాళ్లు కాకపోవడంతో వెనుకడుగు వేశారని భోగట్టా. మీనాక్షి పేరులో చౌదరి ఉంది కాబట్టి ఆమె ఏపీ అధికార పార్టీ కులానికి చెందిన యువతి అని చాలామంది భావిస్తున్నారు. అయితే ఆమె నార్త్ చౌధురి కులానికి చెందిన యువతి కావడం గమనార్హం.
శ్రీలీల ఆ పదవికి పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఆమె తెలుగమ్మాయి కాబట్టి ఆ పదవికి అర్హురాలు అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ హీరోయిన్ల కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం ఇప్పట్లో ఈ పదవిపై పెద్దగా దృష్టి పెట్టకుండా ఉంటే బెటర్ అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం భవిష్యత్తు నిర్ణయాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. మీనాక్షి చౌదరి ఈ వివాదం గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.