టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో పుష్ప 2 చిత్రం పాన్ ఇండియా లెవెల్లో విడుదలై ఎలాంటి రికార్డులను తిరగాల్సిందో తెలియజేయాల్సిన పనిలేదు.. హిందీలో కూడా అల్లు అర్జున్ కు భారీ క్రేజ్ ఏర్పడేలా చేసింది. అందుకే తన తదుపరిచిత్రం కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేయవలసి ఉండగా కొన్ని కారణాల చేత తమిళ డైరెక్టర్ అట్లి ప్రాజెక్టుని తెరమీదకి తీసుకొచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


డైరెక్టర్ అట్లీ జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని అటు బాలీవుడ్, టాలీవుడ్ , కోలీవుడ్ లో కూడా మంచి పేరు సంపాదించారు.  అల్లు అర్జున్ కి డైరెక్టర్ అట్లి కథ సిద్ధం చేశారని ఇటీవలే అల్లు అర్జున్ కు కూడా కథ చెప్పారని అందుకు అల్లు అర్జున్ కూడా కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపించింది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారని అందులో ఒకరు అల్లు అర్జున్ కాక మరొకరు తమిళ హీరో ఉండబోతున్నట్లు సమాచారం.


అయితే సినిమా షూటింగ్ టైమ్ లైన్లో అలాగే లార్జెస్ట్ అంశాల పైన కూడా డైరెక్టర్ అట్లీ తో పాటుగా తన టీమ్ కూడా కసరత్తులు చేస్తోందట. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. సుమారుగా 600 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్ ఈ సినిమాని నిర్మిస్తోందట. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ గా నటిస్తారని టాక్ వినిపిస్తోంది. అందులో ఒకరు జాన్వీ కపూర్ ఫిక్స్ చేయగా మరి కొంతమంది నటిస్తూ ఉన్నారు. అలాగే సంగీతాన్ని అభయంకర్ అందిస్తూ ఉన్నారట. ఈ సినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి అల్లు , అట్లీ కాంబినేషన్లు ఈ విషయం వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: