శోభిత ధూళిపాళ్ల ఎప్పుడైతే అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లిందో అప్పటినుండి చాలామంది శోభిత ను ఓర్వలేక ఆమెపై ట్రోలింగ్ చేయడమే కాదు అసభ్య వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు రొమాన్స్ చేయడం అనేది కామన్.అది ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు.అందుకే హీరో హీరోయిన్లు సినిమాలో ఎంత రొమాన్స్ చేసినా కూడా దాన్ని పర్సనల్ లైఫ్ వరకు తీసుకొచ్చుకోరు. కానీ కొంతమంది మాత్రం పదే పదే వాటిని వైరల్ చేస్తూ ఇంట్లో వాళ్ళకి కోపం తెప్పించేలా చేస్తూ ఉంటారు. అయితే తాజాగా అలాంటి ఒక వీడియోనే శోభిత ధూళిపాళ్లకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తాజాగా యూట్యూబ్లో ఒక షార్ట్ వైరల్ అవుతుంది.

 అందులో ఏముందంటే.. శోభిత ధూళిపాళ్ల చీర కట్టుకొని నిలుచొని ఉంటే ఒక నటుడు ఆమె దగ్గరికి వచ్చి ఆమె బ్యాక్ ని గట్టిగా ఒత్తి నడుము దగ్గర టచ్ చేస్తాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో పాటు ఈ వీడియో పై పాపం నాగచైతన్య ఈ వీడియో చూస్తే ఏమైపోతాడో..శోభిత ధూళిపాళ్ల తన సినిమాల్లో ఇంత దారుణంగా నటించిందా అంటూ పోస్ట్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ ఈ వీడియో పై అసభ్య కామెంట్లు పెడుతున్నారు.

కానీ మరి కొంతమంది మాత్రం శోభిత ధూళిపాళ్లకి సపోర్ట్ ఇస్తూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శోభిత రొమాన్స్  చేసినట్టు చేయక తప్పదు.అది అందరికీ తెలిసిన విషయమే.. నాగచైతన్య తన సినిమాల్లో హీరోయిన్స్ ఇలాంటి రొమాన్స్ చేయలేదా.. ఎందుకు శోభితను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. విడాకులు తీసుకున్న సమంత కూడా ఇలాంటి రొమాంటిక్ సీన్స్ ఎన్నో చేసింది. ఎందుకు పాపం శోభితను ప్రతిసారి టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆమెకు మద్దతుగా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి శోభితకు సంబంధించి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: