పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ హీరో. పైగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ అధికారంలో ఉన్న జనసేన పార్టీకి అధ్యక్షుడు. ఇప్పుడు తెలుగు ప్రజలలో, తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా వస్తోంది అంటే.. తెలుగు గడ్డమీద తెలుగు ప్రేక్షకులలో ఏ స్థాయిలో హైప్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ.. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా విషయంలో ఎందుకో ట్రేడ్ వర్గాలలో బిజినెస్, సర్కిల్స్‌లో అనుకున్న స్థాయిలో బ‌జ్ కనిపించడం లేదు.


సినిమా ఎప్పుడో మూడేళ్ల క్రితం ప్రారంభమైంది.. షూటింగ్ సుదీర్ఘంగా కొనసాగుతూ వచ్చింది.. దర్శకుడు క్రిష్ మధ్యలో ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.. ఇప్పటికే అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువ అయింది.. కథ‌ మారిపోయింది.. ఫైట్లు తీసేశారు.. పాటలు కూడా ఒకటి రెండు కోత పెట్టేశారు.. ఈ క్రమంలోనే ఎందుకో హరిహర వీరమల్లు సినిమా విషయంలో ట్రేడ్ వర్గాలలో భారీ స్థాయిలో అంచనాలు అయితే లేవు. పవన్ కళ్యాణ్ స్థాయిలో.. ఈ సినిమాకు బిజినెస్ జరగటం లేదు అన్నది వాస్తవం.


అందుకే నిర్మాత ఏం.రత్నం సైతం టెన్షన్ పడుతున్నట్టుగా కనిపిస్తోంది. నిర్మాత ఏం.రత్నం తనయుడు జ్యోతి కృష్ణ.. ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కెరీర్‌లో ఒక్క హిట్‌ కూడా లేదు. ఇవన్నీ ఈ సినిమా పట్ల క్రేజ్ తగ్గటం, బిజినెస్ తగ్గటానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు కానీ.. స్టిల్స్ కానీ.. సినిమా పట్ల ఏమాత్రం ఆసక్తి పెంచలేకపోయాయి. హరిహర వీరమల్లు సినిమా కంటే సుజిత్ దర్శకత్వంలో పవన్ గ్యాంగ్ స్టార్‌గా నటిస్తున్న ఓజి సినిమా మీద ఎక్కువ క్రేజ్ ఉంది. ఓజి సినిమాకు భారీగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది అన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: