
దీంతో ఈ సినిమా చూసిన వారందరూ కూడా తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ చేయాలని డిమాండ్ పెరగడంతో ఈ విషయాన్ని గమనించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాని ఎలాగైనా తెలుగులో విడుదల చేయాలని పట్టుబడి మరి గీత ఆర్ట్స్ బ్యానర్ పైన మార్చి 7వ తేదీన గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని చిత్ర బృందం రిలీజ్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే ఒక్కొక్కరికి గూస్ బాంబ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే చత్రపతి శివాజీ జన్నత్ చేరుకున్నారు జన అనే డైలాగుతో మొదలవుతుంది. ఆ తర్వాతే శంబాజీ మహారాజ్ ఎంట్రీ అదిరిపోయేలా ఉన్నది మరాఠీ సామ్రాజ్యానికి ఎవరు అడ్డు వచ్చిన చీల్చి చెందాడుతా అనే డైలాగుతో హైలెట్ గా ఉన్నది. అలాగే రష్మిక యాక్టింగ్, విక్కీ కౌశల్ నటన అద్భుతంగా కనిపిస్తోంది. ఇందులో ఎన్నో సన్నివేశాలు ట్రైలర్ ని హైలైట్ గా చేస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్న ఛావా ట్రైలర్ మరి ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి. బాలీవుడ్ కి ఛావా సినిమా ఊపిరి పోసిందని చెప్పవచ్చు.