- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ అంటే ఒకప్పుడు మంచి హిట్ సినిమాల కు పెట్టింది పేరు. ముకుంద, ఫిదా, గద్దల కొండ గణేష్ , ఎఫ్ 2 , ఎఫ్ 3 లాంటి మంచి సినిమాల లో నటించిన వరుణ్ తేజ్‌కు .. తెలుగు ప్రేక్షకులు ఓటేశారు. వరుణ్ తేజ్ నటన అంటే చాలామంది ఇష్టపడతారు. ఫిదా , గద్దల కొండ గణేష్ లాంటి సినిమాలు వరుణ్ తేజ్ ను నటుడిగా, వైవిధ్యమైన హీరో గా ప్రేక్షకుల ముందు నిలబెట్టాయి. అక్కడ వరకు బాగానే ఉంది. అయితే వరుణ్ గత కొన్నేళ్ళుగా చేస్తున్న సినిమాలు వరుస‌పెట్టి డిజాస్టర్లు అవుతున్నాయి.


ఇంకా చెప్పాలంటే డిజాస్టర్లు అనే పదం కూడా వరుణ్ తేజ్ సినిమాలకు సరిపోవటం లేదు. అంతకుమించి డబుల్ డిజాస్టర్ , బిగ్ డిజాస్టర్ అనే పదాలతో వరుణ్ తేజ్ సినిమాలను సినీ విమర్శకులు విమ‌ర్శిస్తోన్న పరిస్థితి. వరుణ్ తేజ్ ప్రధానంగా కథాబలం ఉన్న సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేయడం లేదు. కాస్త రెమ్యూనరేషన్ చూసుకొని వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అందుకే వరుసగా గాంఢీవ ధారి అర్జున , గని , ఆపరేషన్ వాలంటైన్ , మట్కా లాంటి డిజాస్టర్ సినిమాలు వరుసగా వరుణ్ తేజ్ కెరీర్‌ని పాతాళానికి పడగొట్టేసాయి.


మట్కా సినిమా అయితే నెగిటివ్ షేర్ తెచ్చుకుందంటే .. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ఇక వరుణ్ తేజ్ సినిమా లు కొనాలంటే డిస్ట్రిబ్యూటర్లు , ఎగ్జిబిటర్లు కూడా అడ్వాన్సులు ఇచ్చేందుకు కూడా ఇష్టపడటం లేదన్న ప్రచారం జరుగుతుంది. వరుణ్ తేజ్ ఇవన్నీ తెలుసుకుని ఇప్పటికైనా ఒక్క హిట్ కొడితే.. మళ్ళీ అతడు కెరీర్ ట్రాక్ ఎక్కుతుంది అనటం లో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: