
మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో నాని కథలు ఎంచుకునే తీరు.. ప్రతి ఒక్కరిని ఎంతో మెప్పిస్తుంది. ఒక సినిమా ప్లాప్ అయినా కూడా.. నాని ఎంచుకునే కథ.. ఆ కథలో పాత్రకు న్యాయం చేసే విధానం.. నిజంగా అభినందనీయం. కానీ.. నాని సినిమాలకు లాభాలు రావటం లేదు అన్నది ఇటీవల టాలీవుడ్ సర్కిల్స్‌లో ఎక్కువగా.. ఇంకా చెప్పాలంటే తరచుగా వినిపించే మాట. నాని వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. కానీ.. ఏ సినిమాకు కూడా నిర్మాత కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ.. లాభం కళ్ల చూడటం లేదు అన్నదే.. ప్రధాన ఆరోపణ.
ఇందుకు ప్రధాన కారణం.. నాని సినిమాలకు బడ్జెట్ కాస్త అటు.. ఇటుగా.. రూ.100 కోట్లు అవుతుంది. ఇక్కడ నాని చేయాల్సిన పని ఒకటి ఉంది. నాని రెమ్యునరేషన్ దాదాపు రూ.30 నుంచి రూ.35 కోట్ల మధ్యలో ఉంటుంది. తన రెమ్యూనరేషన్ రూ.25 కోట్లు. ఇంకా చెప్పాలంటే.. రూ.25 కోట్లకు కాస్త తగ్గించుకొని తన సినిమాల బడ్జెట్ కంట్రోల్‌లో ఉంచుకునేలా చేస్తే.. అప్పుడు అన్ని ఏరియాలకు రీజనబుల్ రేట్లు అమ్ముతారు. ప్రతి సినిమాకు అందరికీ లాభం వస్తుంది. అలా చేయని పక్షంలో నాని సినిమా అంటే లాభం రాదన్న మాట, ముద్ర నాని పై శాశ్వతంగా ఉండిపోతుంది. ఈ ఒక్క విషయంలో నాని సరిచేసుకుంటే.. అతనికి తిరుగు ఉండదని చెప్పాలి.