టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రస్తుతం.. ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 2017 లో వచ్చిన టెంపర్ సినిమాతో ఎన్టీఆర్ విజయాల పరంపర మొదలైంది. టెంపర్ సినిమా నుంచి గత ఏడాది వచ్చిన దేవర సినిమా వరకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేకుండా ఎన్టీఆర్ వ‌రుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. వరుసగా టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, వీర రాఘవ, త్రిబుల్ ఆర్, దేవర సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఎన్టీఆర్.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2.. మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌ సినిమాతో పాటు.. దేవర 2 సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. వార్ 2 సినిమాలో నటిస్తున్నందుకుగాను జూనియర్ ఎన్టీఆర్ కు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అన్నదానిపై బాలీవుడ్ వర్గాలలో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఈ సినిమాలో నటిస్తున్నందుకు ఎన్టీఆర్‌కు దాదాపుగా రూ.70 కోట్ల రెమ్యూనరేషన్‌ను నిర్మాతలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. పైగా.. ఎన్టీఆర్‌కు ఇప్పుడు.. పాన్ ఇండియా క్రేజ్ వచ్చేసింది. వరుసగా త్రిబుల్ ఆర్, తాజాగా వచ్చిన దేవర సినిమాలు రెండు.. పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.


దేవర సినిమాకు.. కొరటాల శివ దర్శకుడు. పైగా సినిమాకు మిక్స్‌డ్‌ టాక్ వచ్చింది. అయినా.. కూడా ప్రపంచ వ్యాప్తంగా రూ.450 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా.. ఎన్టీఆర్ షో చేసి అలా తెరమీద కనిపిస్తే చాలు.. సినిమాలకు కాసులు వర్షం కురుస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఉండడంతో వార్ 2 సినిమాకు.. అటు నార్త్ ఇండియాతో పాటు.. ఇటు సౌత్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఓవర్సీస్ లోను భారీ ఎత్తున క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌కు రూ.70 కోట్లకు కాస్త అటు ఇటుగా రెమ్యునరేషన్ నిర్మాతలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: