- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అద్భుతమైన సినిమాలలో బద్రి ఒక‌టి. 2000 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు 45 కేంద్రాలలో వంద రోజులు ఆడింది. మరీ ముఖ్యంగా బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ .. స్టైల్ .. ఆ డైలాగ్ డెలివరీ కి ప్రేక్షకులు తెలుగు యువత ఫిదా అయిపోయారు. బద్రి నుంచి ప‌వ‌న్‌ అంటే యూత్లో పిచ్చ క్రేజ్ వచ్చేసింది. ఖుషి సినిమా టైమ్ కి వచ్చేసరికి ఈ క్రేజ్ మరింత పిచ్చిగా ముదిరిపోయింది. పవన్ ను ఆరాధించడం మొదలు పెట్టేశారు. ఇక బద్రి సినిమాతో పూరి జగన్నాథ్ దర్శకుడి గా తెలుగు తెర కు పరిచయం అయ్యారు. తొలి సినిమా తో నే ప‌వ‌న్ ను డైరెక్ట్ చేసి హిట్ కొట్ట‌డంతో పూరి ఒక్క దెబ్బ‌కు సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయాడు.


ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ అమీషా పటేల్ రేణు దేశాయ్ హీరోయిన్గా నటించారు. అమీషా పటేల్ అప్పటికే హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన కహోనా ప్యార్ హై సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. బద్రి సినిమాతో ఆమె తెలుగులో తిరుగు లేని క్రేజ్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమా హిట్ అయ్యాక ఖుషి సినిమా తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ - అమీషా పటేల్ కాంబినేషన్లో చెప్పాలని ఉంది టైటిల్తో మరో సినిమా అనుకున్నారు. సినిమా ముహూర్తపు షాట్ కూడా జరిగింది. ఏవో కారణాలతో ఈ సినిమా అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత అదే చెప్పాలని ఉంది టైటిల్తో కొట్టే నవీన్ హీరోగా .. రాశి హీరోయిన్గా చంద్రమహేష్ ద‌ర్శ‌క‌త్వం లో ఓ సినిమా వచ్చి ప్లాప్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: