- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లో ఎన్నో సినిమాలలో నటించారు. ఎన్టీఆర్ రెండు దశాబ్దల కెరీర్లో కొన్ని సూపర్ హిట్ సినిమాలు చేశారు .. కొన్ని హిట్ సినిమాలు చేశారు .. కొన్ని యావరేజ్ అయితే మరికొన్ని ప్లాప్ అయ్యాయి. ఎన్టీఆర్ కెరీర్ లో వైవిధ్యమైన ప్రయత్నంగా చేసిన సినిమా రామయ్య వస్తావయ్యా .. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ కి జోడిగా సమంత - శృతిహాసన్ నటించిన సినిమా తొలి భాగం అదిరిపోయింది అన్న టాక్ తెచ్చుకుంది. అయితే రెండో భాగం చూసిన ప్రేక్షకులు నిరసించి పోయారు. ఎన్నో ఆశలతో సినిమాకు వెళితే ఎన్టీఆర్ నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఊహించలేదని నిరాశపడ్డారు. హరీశంకర్ ఇంటర్వెల్ వరకు సినిమాను అద్భుతంగా తెర‌కు ఎక్కించిన సెకండాఫ్ విషయంలో తడబడ్డాడు.


సినిమా రిలీజ్ అయిన రోజు మ‌ధ్యాహ్నం జూనియర్ ఎన్టీఆర్ - దిల్ రాజు - హరీశంకర్ ముగ్గురు కలిసి కూర్చుని ఆరు గంటల పాటు చర్చించుకున్నారట. సినిమాకు ఎందుకు నెగిటివ్ టాక్ వస్తోంది. సినిమా ఎక్కడ తేడా కొట్టింది .. ఏమేం తప్పులు చేసాం అని చర్చించుకున్నారట. ఎన్టీఆర్ సినిమా ప్లాప్ అని తొలిరోజు మధ్యాహ్నం ఒప్పుకున్నారట. కట్ చేస్తే ఈ సినిమాకు లాంగ్ ర‌న్ లో రు. 35 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో పాటు సినిమా నిర్మించిన దిల్ రాజుకు మంచి లాభాలు వచ్చాయి. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పటం విశేషం. ఆ తర్వాత అదే దిల్ రోజు బ్యానర్ లో జూనియర్ ఎన్టీఆర్ బృందావనం లాంటి హిట్‌ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: