- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ .. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ దేవర ’ భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దిమ్మ‌తిరిగే దండయాత్ర చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ఏకంగా రు. 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో దేవ‌ర సినిమాకు కంటిన్యూగా వ‌స్తోన్న దేవ‌ర 2 సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ‘ దేవర పార్ట్ - 2 ’ స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ చాలా క‌సితో ప‌ని చేస్తున్నాడ‌ట‌.


దేవ‌ర 2 స్క్రీన్ ప్లే , కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ , తన టీమ్‌ తో ప‌ని చేస్తున్నాడు. అయితే పార్ట్ 2 లో క‌థ లో చాలా మార్పులు చేస్తున్నార‌ని స‌మాచారం. ఇందులో భాగంగా బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కోసం ఓ ప్రత్యేక పాత్రను డిజైన్ చేశాడని టాక్ ? అదే జ‌రిగితే దేవ‌ర 2 సినిమా కోసం బాలీవుడ్ జ‌నాల తో పాటు నార్త్ ఇండియన్లు కూడా ఏ స్థాయిలో వెయిట్ చేస్తారో తెలిసిందే.


కాగా వచ్చే ఏడాది జనవరి చివరి వారం నుంచి దేవ‌ర 2 సినిమా సెట్స్ మీద‌కు తీసుకు వెళ్ల‌నున్నారు. ఈ లోగా ఎన్టీఆర్ వార్ 2 సినిమా తో పాటు ప్ర‌శాంత్ నీల్ సినిమాల షూటింగ్ ల‌ను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక దేవ‌ర జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర చేయ‌గా.. త‌మిళ స్టార్ అనిరుధ్ మ్యూజిక్ అందించారు. శ్రీకాంత్ - ప్రకాష్ రాజ్ - అజయ్ - మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: