
అసలు విమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ పదవికి మొదటిగా అనుకున్న ముగ్గురు హీరోయిన్లు ఎవరో తెలుసా..?

నిజానికి ఈ ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడానికి అధిష్టానం ముందుగా ముగ్గురు హీరోయిన్స్ పేరులను ప్రతిపాదనకు తీసుకువచ్చిందట. వాళ్లు మరెవరో కాదు యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ..సెన్సేషనల్ హీరోయిన్ సాయి పల్లవి.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఈ ముగ్గురిలో ఎవరినో ఒకరిని ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలి అంటూ ఆలోచనలో పడ్డారట . అయితే ఈ వార్త కొంతమంది ద్వారా బయటకు వచ్చేసింది . అంతేకాదు చాలామంది ప్రముఖులు మీనాక్షి చౌదరినే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలి అంటూ ప్రస్తావన తీసుకొచ్చారట.
మరి ఎలా బయటపడిందో తెలియదు కానీ ఆ విషయం బయటకు వచ్చి సోషల్ మీడియాలో రెండు రోజుల నుంచి బాగా హైలెట్గా మారింది . అయితే తాజాగా ఇదంతా ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం . అయితే గవర్నమెంట్ చూస్ చేసుకున్న ముగ్గురు హీరోయిన్లు కూడా తెలుగు వాళ్ళు కాకపోవడం ఇక్కడ హైలెట్ అయిన విషయం. మీనాక్షి చౌదరి నార్త్ లో ఉండే చౌదరి . ఇక సాయి పల్లవి తమిళ్ - మలయాళీ ప్రాంతాలకు చెందిన అమ్మాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఓ కన్నిడిగ. మరి ఈ ముగ్గురు హీరోయిన్స్ లో ఎవరిని ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తారు..? అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??