
ఈమధ్య కాలంలోనే అట్లీ టీం వచ్చి స్వయానా అల్లు అర్జున్ ని ఇంటికి వెళ్లి మీట్ అవ్వడం. అదేవిధంగా అల్లు అర్జున్ తన లుక్స్ మొత్తం మార్చేయడం బాగా హైలైట్ గా మారింది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు మార్చ్ నెలాఖరులో జరగబోతున్నాయట . అంతేకాదు ఈ సినిమాలో బన్నీ ఢిఫరెంట్ లుక్స్ లో దర్శనం ఇవ్వబోతున్నారట. అంతేనా ఈ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ లో హీరోయిన్గా బాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ జాన్వి కపూర్ ని చూస్ చేసుకున్నారట.
జూనియర్ ఎన్ టీఆర్ నటించిన "దేవర" సినిమాపై చాలా ఎక్స్పెక్ట్ చేసింది జాన్వి కపూర్. కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు. ప్రసెంట్ రామ్ చరణ్ సినిమాలో ఇప్పుడు హీరోయిన్గా నటిస్తుంది. అదే కాకుండా విజయ్ దేవరకొండ తోనూ ఒక సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ సరసన కూడా నటించబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది . ఇదే ముందుకెళ్తే మాత్రం నెక్స్ట్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఈ హాట్ జాన్వీ కపూర్ నే అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి జాన్వి కపూర్ కి వచ్చిన అవకాశాలను ఎలా వినియోగించుకుంటుందో..? ఎలా ముందుకు వెళ్తుందో..??