
మరీ ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్ - వెంకటేష్ మధ్య పండిన కెమిస్ట్రీ - కామెడీ వేరే లెవల్ అని చెప్పాలి . వెంకటేష్ - సౌందర్యల కాంబో ని మరోసారి రిపీట్ చేశాడు ..వెంకటేష్ - ఐశ్వర్య లతో అనిల్ రావిపూడి అంటూ చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన డైరెక్షన్ ను పొగిడేస్తున్నారు. తాజాగా అనిల్ రావిపూడి ఓ సందర్భంలో మాట్లాడుతూ ఆయన మనసులోని కోరికను బయట పెట్టాడు. అది కాస్త ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.
"ఎవరితో చేస్తానో ఎప్పుడు చేస్తానో తెలియదు కానీ నాకు ఒక బిగ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. మహాభారతం బ్యాక్ గ్రౌండ్ లో ఒక మైథాలజికల్ సినిమాను చేయాలనుకుంటున్నాను . ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కచ్చితంగా చేస్తాను . మహాభారతంలోని ఏదో ఒక పాయింట్ పట్టుకొని సినిమాగా తెరకెక్కిస్తాను అంటూ చెప్పుకొచ్చారు". నిజానికి రాజమౌళి ఎప్పటినుంచో మహాభారతాన్ని తెరకెక్కించాలి అంటూ ఆశపడుతున్నారు . అది ఆయన డ్రీం ప్రాజెక్ట్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా అదే విషయం బయట పెట్టడంతో ఇద్దరికీ ఇద్దరే అంటూ జనాలు ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు. అయితే కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలను తెరకెక్కించే విధంగా రాజమౌళి ఎంత ఫేమసో.. చాలా చిన్న బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించి .. దానికి ట్రిపుల్ ప్రాఫిట్స్ రప్పించడంలో అనిల్ రాయపూడి అంతే ఫేమస్ అంటూ జనాలు అనిల్ రావిపూడి అని బాగా ప్రశంసిస్తున్నారు . అనిల్ రావిపూడి మనసులో ఉన్న కోరిక కచ్చితంగా నెరవేరాలని కోరుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..??