తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షోలో విన్నర్ గా నిలిచిన శివబాలాజీ అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు. ఇండస్ట్రీకి వచ్చినప్పటినుండి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ హీరోగా ఎన్నో సినిమాల్లో రాణించారు. ఇప్పటికీ కూడా పలు సినిమాల్లో రాణిస్తున్నారు. అయితే అలాంటి శివ బాలాజీ నటి మధుమితను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరి ప్రేమ పెళ్లిలో ఎన్నో ట్విస్ట్ లు ఉన్నాయి. మొదట వీరి జాతకాలు కలవకపోవడంతో చాలా రోజులు దూరంగా ఉండి మాట్లాడుకోలేదు. ఇక పెళ్లి క్యాన్సిల్ అనుకున్న సమయంలో మళ్లీ వీరిద్దరూ కలిశారు. వీరి ప్రేమే మళ్ళీ వీరిని ఒక్కటి చేసింది.అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇక తరచూ ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ గా నిలిచే శివ బాలాజీ మధుమితతో తాజాగా విడాకులు తీసుకోబోతున్నట్టు ఓ రూమర్ మీడియాలో వైరల్ అవుతుంది. 

అయితే ఈ విడాకుల రూమర్స్ సోషల్ మీడియాలో వినిపించడానికి ప్రధాన కారణం మధుమిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలే.మధుమిత ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవలు,చిన్న చిన్న గిల్లికజ్జాలు జరిగాయి. అయితే ప్రతిసారి శివ బాలాజి విడాకులు తీసుకుందాం అనేవారు. ఎందుకంటే ఇలా గొడవలతో సంసారాన్ని సాగదీయడం కంటే విడాకులు తీసుకోవడం బెటర్ అని.కానీ చాలా సార్లు నేనే ఆయనకు సర్ది చెప్పి విడాకులు తీసుకోకుండా కన్విన్స్ చేశాను. అయితే పెళ్లయిన ఏడాది ఓ సంఘటన జరగడంతో ఇద్దరం విడాకులు తీసుకోవాలని ఫిక్స్ అయ్యాం.

కానీ ఆ తర్వాత మా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని వాటిని పక్కన పెట్టాం అంటూ మధుమిత చెప్పుకొచ్చింది.అలాగే శివ బాలాజీ ఇండస్ట్రీలో జరుగుతున్న విడాకుల గురించి మాట్లాడుతూ చాలామంది పెళ్లయిన రెండు మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకుంటున్నారు. మన ఇంట్లో ఉండే అక్క, తమ్ముడు, అన్న,అమ్మ,నాన్న లను ఎలాగైతే మార్చలేమో భార్యను కూడా అలాగే మార్చలేము. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే వారి లైఫ్ హ్యాపీగా సాగుతుంది.చిన్న చిన్న అపార్థాలకే విడాకులు తీసుకోవడం మంచిది కాదు.ఒకవేళ ఆ విడాకులు తీసుకోవాల్సి వస్తే మీ మీదే ఆశలు పెట్టుకున్న వారి గురించి ఒకసారి ఆలోచించండి అన్నట్లుగా విడాకులపై స్పందించారు మధుమిత శివ బాలాజీ..

మరింత సమాచారం తెలుసుకోండి: