
ఇంతకీ ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు .. రతికా రోజ్ .. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ సాధారణ రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి .. అలాగే చిన్నప్పటి నుంచి చదువులో కూడా ఎంతో చురుగ్గా ఉండే రతికా హైదరాబాద్లోని మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. ఆ సమయంలో నటనపై ఆసక్తితో బుల్లితెరపై అడుగు పెట్టింది మోడల్గా పనిచేసిన రతికా 2020లో జబర్దస్త్ పేమ్ షకలక శంకర్ నటించిన బొమ్మ అదిరింది సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ..
అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేదు. ఇక తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన నేను స్టూడెంట్ సార్ సినిమాలో కూడా లేడీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించింది .. ఈ సినిమా తర్వాత బిగ్ బాస్ లో అడుగుపెట్టి బాగా పాపులారిటీ పెంచుకోవాలని చూసింది. కానీ ఊహించని విధంగా బిగ్ బాస్ షో తో ఆమెకు ఎక్కువ నెగిటివిటీ వచ్చేసింది .. అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటున్నా రతిక.. తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన పలు హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో మతులు పోగొడుతున్నాయి.