తమిళ నటుడు ప్రదీప్ రంగనాధన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో తమిళ సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన కొంత కాలం క్రితం లవ్ టు డే అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ని ఆ తర్వాత లవ్ టుడే అనే పేరుతో తెలుగులో కూడా విడుదల చేశారు.

మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో ప్రదీప్ రంగనాథన్ కు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే ఈ సినిమాకు ఈయన దర్శకత్వం కూడా వహించాడు. దానితో ఈయనకు దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల చేశారు. ఈ మూవీ ని తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల చేయగా , ఈ మూవీ కి తమిళ్ మరియు తెలుగు భాషలో అద్భుతమైన టాక్ వచ్చింది. దానితో ఇప్పటికే ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లకి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాకు 10 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా చిన్న సినిమాగా విడుదల అయిన ఈ మూవీ 100 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికి కూడా ఈ మూవీకి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. దానితో ఈ మూవీ మరికొన్ని రోజుల పాటు అద్భుతమైన కలక్షన్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: