మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. కానీ ఈ సినిమాకు విడుదలైన మొదటి రోజు మొదటి షో కే ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ప్రభావాన్ని చూపలేకపోయింది. ఇకపోతే ప్రస్తుతం చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఆర్ సి 16 అనే పర్సన్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... శివరాజ్ కుమార్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... వ్రీద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ను ఢిల్లీలో మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా త్వరలోనే ఈ మూవీ యూనిట్ ఢిల్లీ కి వెళ్ళబోతున్నట్లు సమాచారం. ఇక ఢిల్లీలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతానికి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే చాలా రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: