ఇక ఈ సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర , గేమ్ చేంజర్ కారణంగా వెనక్కి వెళ్లిపోయింది .. సమ్మర్ లో వస్తుంది అనుకున్నారు .. మే 9 కి రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు .. అయితే ఇప్పుడు ఈ సినిమా వేసవి నుంచి పక్కకు వెళ్లిందని అంటున్నారు.. ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు కనకగా ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ..చిరంజీవి వశిష్ట కాంబోలో వస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా . యువీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది .. సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఉద్దేశంతో యువీ సంస్థ ఓ టీజర్ను కూడా రిలీజ్ చేసింది ..


అయితే అప్పటినుంచి ఈ సినిమాకు ఆసలైన కష్టాలు మొదలయ్యాయి .. టీజర్ లో విజువల్స్ ఎవరికి అంతగా నచ్చలేదు .. అలాగే సినిమాపై ఉన్న అంచనాల్ని పూర్తిగా తగ్గించేసాయి .. ఇక దాంతో గ్రాఫిక్స్పై మరోసారి రీ వర్క్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది .. మరోపక్క ఓటీటీ మార్కెట్ కూడా పెద్దగా ఆశించిన స్థాయి లో రాలేదు .. ఇక దాంతో రిలీజ్ కు ఆలస్యం అవుతూ వచ్చింది .. అయితే ఇప్పుడిప్పుడే విశ్వంభర డీల్స్ ఒక్కొక్కటిగా క్లోజ్ అవుతున్నాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా మంచి ధరకే అమ్ముడయ్యాయి .. ఓటీటీ డీల్‌ కూడా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే .. అయితే కాకపోతే రిలీజ్ విషయంలో మాత్రం సినిమా యూనిట్ ఇంకా ఏ నిర్ణయానికి రాలేక పోతుంది .


ఈ సినిమాను సమ్మర్లో రిలీజ్ చేసే అవకాశాలు లేవని .. ప్రధానంగా ఆర్టిస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు కాబట్టి సినిమా రిలీజ్ కి కొంత క్రేజ్ ఉంటుందని .. ఫ్యాన్స్ కి కూడా ఓ గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుందని వారు భావిస్తున్నారు  .  అయితే రెండు పాటలు మిగతా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది .. ఈ గ్యాప్ లో వీఎఫ్ఎక్స్‌పై మరింత వర్క్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక మరోపక్క అనిల్ రావిపూడి  ,చిరంజీవి కోసం ఓ క‌థ‌ రెడీ చేసిన విషయం తెలిసిందే .. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టేసారు రావిపూడి . సంక్రాంతికి వస్తున్నాం లాగే ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది .. ఇక ఇది 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: