కొన్ని సంవత్సరాల క్రితం విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో వెంకటేష్ కి జోడిగా అంజలి నటించగా , మహేష్ కు జోడిగా సమంత నటించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

చాలా కాలం తర్వాత తెలుగు లో వచ్చిన మల్టీ స్టారర్ మూవీ కావడంతో మొదటి నుండి కూడా ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం ఈ సినిమా తగ్గకుండా ఉండడంతో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను కూడా బాక్సా ఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా కొన్ని సంవత్సరాల క్రితం విడుదల సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాలో తిరిగి మళ్ళీ థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ని మార్చి 7 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా రీ రిలీజ్ కు సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ రీ రిలీజ్ కి సంబంధించిన బుకింగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఇకపోతే మార్చి 7 వ తేదీన హిందీ డబ్బింగ్ సినిమా అయినటువంటి ఛావా మూవీ ని తెలుగులో విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఉండడంతో తెలుగు లో విడుదల రోజు ఈ మూవీ కి భారీ కలెక్షన్లు వస్తాయి అని చాలా మంది అంచనా వేశారు. కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కూడా అదే రోజు రీ రిలీజ్ కానుండడం , ఆ మూవీ బుకింగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి వస్తుండడంతో ఛావా మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కాస్త కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: