
మనమే చిత్రంలో రాహుల్ రవీంద్రన్, శివ కందుకూరి కీలకమైన పాత్రలో నటించారు. గత ఏడాది జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మనమే సినిమా. ఇప్పటివరకు ఈ సినిమా ఓటీటీ లోకి నోచుకోలేదు. అయితే ఎట్టకేలకు ఓటీటీ డీల్ సెట్ అయినట్లుగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నది దీంతో ఈ నెల తొమ్మిదవ తేదీన మనమే చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్త్రిమ్మింగ్ కాబోతోందట. అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వెలుబడనుంది.
శర్వానంద్ హీరోగా డైరెక్టర్ రామ్ అబ్బరాజు కాంబినేషన్లో వస్తున్న నారీ నారీ నడుమ మురారి సినిమా రాబోతోంది ఈ చిత్రంలో హీరోయిన్గా సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటిస్తూ ఉన్నారట. అయితే ఈ సినిమాని బాలయ్య చిత్రానికి సంబంధించి టైటిల్ కావడంతో ఈ సినిమా పైన మరింత ఆసక్తి పెరుగుతోందట. ఇదే కాకుండా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి డైరెక్షన్ లో మరొక సినిమాలు నటించబోతున్నారు. హీరో శర్వానంద్ ఈ చిత్రాన్ని యువి క్రియేషన్ బ్యానర్ పైన తెరకెక్కించబోతున్నారట. శర్వానంద్ తండ్రి పాత్రలో అలనాటి హీరో రాజశేఖర్ కూడా కనిపించబోతున్నట్లు టాకు వినిపిస్తోంది. మరి శర్వానంద్ చిత్రాలకు ఈ సీనియర్ హీరోల టైటిల్స్ ఏవిధంగా కలిసి వస్తాయో చూడాలి.