మోస్ట్ టాలెంటెడ్ నటులలో ఒకరు అయినటువంటి ఆది పినిశెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో తమిళ , తెలుగు సినిమాలలో నటించి రెండు ఇండస్ట్రీలలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తెలుగులో ఈయన కొంత కాలం క్రితం సరైనోడు అనే సినిమాలో విలన్ పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. కొంత కాలం క్రితం ఈ నటుడు రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కు సోదరుడి పాత్రలో నటించి ఆ పాత్రలోనూ తన అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. అలాగే ఎన్నో సినిమాలలో హీరో గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆది పినిశెట్టి "శబ్దం" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ తాజాగా విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. మరి ఈ మూడు రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 60 లక్షల రేంజ్ లో షేర్ కలెక్షన్లు దక్కగా , 1.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు దక్కినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు రెండు కోట్ల మీద ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ 2.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో బరిలోకి దిగినట్లు సమాచారం. దానితో ఈ మూవీ మరో 1.60 కోట్ల షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: