97వ ఆస్కార్‌ అవార్డుల ప్రధాన ఉత్సవం మార్చి 3న భారత టైం ప్రకారం ఉదయం 5 గంటలకు అమెరికాలోని లాస్ ఏంజీల్స్‌లో జరిగింది .. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్స్ ఉత్తమ య‌నిమేటెడ్ ఫ్యూచర్ ఫిల్మ్ , ఉత్తమ నటుడు , ఉత్తమ నటి అనేక విభాగాలో ఈ అవార్డులను అందిస్తారు. సినీ ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మక అవార్డుగా పరిగణించే ఆస్కార్ అవార్డుల సంబరం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది . ఇక ఇందులో రొమాంటిక్ కామెడీ డ్రామా అనోరాకు అవార్డులు వెల్లువాల‌ వచ్చాయి . అలాగే బెస్ట్ మూవీ , బెస్ట్ డైరెక్టర్ , బెస్ట్ హీరోయిన్ , స్క్రీన్ ప్లే , ఎడిటింగ్ ఇలా అన్ని విభాగాల్లో అవార్డులను అందుకుంది .. అలాగేది ది బ్రూటలిస్ట్ లో నటనకు గాను ఉత్తమ నటుడుగా అడ్రియన్‌ బ్రాడీ .. అనోరాలో నటనకు మైకీ మ్యాడిసన్‌ ఉత్తమ నటిగా ఈ అవార్డు అందుకున్నారు .. అలాగే సీన్ బ్రేకర్ (అనోరా) ఉత్తమ దర్శకుడిగా అవార్డు గెలుచుకున్నారు. అలాగే ది రియల్‌ పెయిన్ సినిమాకి హాలీవుడ్ నటుడు కీరన్‌ కైల్‌ కల్కిన్‌ ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ గెలుచుకున్నారు .. ఎమిలియా పెరెజ్ లో నటనకు జోయా సాల్దానా ఉత్తమ సహాయనటిగా అవార్డు గెలుచుకున్నారు .. ఇక గత సంవత్సరం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన డ్యూన్‌:పార్ట్‌2 ఉత్తమ సౌండ్ , విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగాల్లో ఆస్కార్ ను అందుకుంది .. అలాగే ఇక లైఫ్ ఆక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో మ‌న‌ దేశం నుంచి నామినేషన్ లో వెలువడిన అనుజ సినిమాకి నిరాశ ఎదురయింది .. ఈ క్యాటగిరిలో ఐయామ్‌ నాట్‌ ఏ రోబో .. ఉత్తమ లఘ‌ చిత్రంగా ఆస్కార్ గెలుచుకుంది.

ఆస్కార్ విజేతల పూర్తి జాబితా:

ఉత్తమ చిత్రం – అనోరా

ఉత్తమ నటుడు – అడ్రియన్‌ బ్రాడీ (ది బ్రూటలిస్ట్‌)

ఉత్తమ నటి – మైకీ మ్యాడిసన్‌ (అనోరా)

ఉత్తమ దర్శకత్వం – అనోరా (సీన్‌ బేకర్‌)

ఉత్తమ సహాయ నటుడు – కీరన్‌ కైల్‌ కల్కిన్‌ (ది రియల్‌ పెయిన్‌)

ఉత్తమ సహాయ నటి – జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)

ఉత్తమ స్క్రీన్‌ప్లే – అనోరా (సీన్‌ బేకర్‌)

ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే – కాన్‌క్లేవ్‌ (పీటర్‌ స్ట్రాగన్‌)

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌ – వికెడ్‌ (పాల్‌ తేజ్‌వెల్‌)

ఉత్తమ మేకప్‌, హెయిల్‌స్టైల్‌ – ది సబ్‌స్టాన్స్‌

ఉత్తమ ఎడిటింగ్ – అనోరా (సీన్‌ బేకర్‌)

ఉత్తమ సినిమాటోగ్రఫీ – ది బ్రూటలిస్ట్‌ (లాల్‌ క్రాలే)

ఉత్తమ సౌండ్‌ – డ్యూన్‌: పార్ట్‌2

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ – డ్యూన్‌:పార్ట్‌2

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ – ఎల్‌ మాల్‌ (ఎమిలియా పెరెజ్‌)

ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ – ఐయామ్‌ స్టిల్‌ హియర్‌ (వాల్టర్‌ సాల్లెస్‌- బ్రెజిల్‌)

ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ – ది బ్రూటలిస్ట్‌ (డానియల్‌ బ్లమ్‌బెర్గ్‌)

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ – వికెడ్‌

ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ – ఐయామ్‌ నాట్‌ ఏ రోబో

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌– ది ఓన్లీ గర్ల్ ఇన్‌ ది ఆర్కెస్ట్రా

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ – నో అదర్‌ ల్యాండ్‌

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ – ఫ్లో

ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ఫిల్మ్‌ – ఇన్‌ ది షాడో ఆఫ్‌ ది సైప్రెస్‌



మరింత సమాచారం తెలుసుకోండి: