
అదేవిధంగా హను రాఘవపూడి డైరెక్షన్లో వస్తున్న పిరియాడిక్ ప్రేమ కథ సినిమాలో కూడా కొత్త అమ్మాయి ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుంది .. అయితే ఇప్పుడు త్వరలోనే మరో సినిమా కూడా మొదలు పెట్టబోతున్నాడు ప్రభాస్. అసలు మ్యాటర్లోకి వెళితే .. సందీప్ రెడ్డి డైరెక్షన్లో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్ .. అలాగే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో కూడా ఓ సినిమాను చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి .. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ఎంతో డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది .. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ వార్త వైరల్ గా మారింది ..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా ఓ కొత్త హీరోయిన్ నటించబోతుందట .. ఇంతకీ ఆమె మరి ఎవరో కాదు భాగ్య శ్రీ బోర్సే . మాస్ మహారాజా రవితేజకు జంటగా మిస్టర్ బచ్చన్ సినిమాలో ఈమె నటించింది .. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . అయితే రిలీజ్ కు ముందే భారీ క్రేజ్ తెచ్చుకుంది భాగ్యశ్రీ కానీ మిస్టర్ బచ్చన్ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. దాంతో ఈ బ్యూటీ కి అంతగా గుర్తింపు రాలేదు .. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో ఏకంగా ఆరు సినిమాల్లో నటిస్తుంది . ఇక ఇప్పుడు తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలోనే భారీ అవకాశం అందుకుంది.