ఇండియన్ సినీ పరిశ్రమలో ఓ వైపు సంగీత దర్శకులుగా మరో వైపు నటులుగా కెరియర్ను సాగిస్తున్న వారు కూడా కొంత మంది ఉన్నారు. అలాంటి వారిలో జీ వి ప్రకాష్ కుమార్ ఒకరు. ఈయన వరుస పెట్టి సినిమాలకు సంగీతం అందిస్తూనే మరో వైపు అనేక సినిమాల్లో నటిస్తూ నటుడిగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే జీవి ప్రకాష్ కుమార్ ఇప్పటికే అనేక తెలుగు సినిమాలకు కూడా సంగీతం అందించాడు. ఈయన సంగీతం అందించిన ఎన్నో తెలుగు సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే ప్రస్తుతం నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే సినిమా రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జీ వి ప్రకాష్ కుమార్ "కింగ్స్టన్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని మార్చి 7 వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా యొక్క నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను మైత్రి సంస్థ వారు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

మూవీ ని నైజాం ఏరియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి మైత్రి సంస్థ వారు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక తమ బ్యానర్లో రూపొందుతున్న రాబిన్ హుడ్ సినిమాకు సంగీతం అందిస్తున్న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన కింగ్స్టన్ మూవీ ని నైజాం ఏరియాలో విడుదల చేయడానికి మైత్రి సంస్థ ముందుకు రావడంతో ఈ సంగీత దర్శకుడు సినిమాపై మైత్రి సంస్థ వారు గట్టి ఆశలే పెట్టుకున్నారు అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: